జ‌క్క‌న్న‌ పిలుపు కోసం ఆస్కార్ భామ‌ వెయిటింగ్!

ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క‌ఛాన్స్ అంటూ బాలీవుడ్ హీరోలే జ‌క్క‌న్న కోసం క్యూలో ఉన్నారు.

Update: 2024-05-24 06:52 GMT
జ‌క్క‌న్న‌ పిలుపు కోసం ఆస్కార్ భామ‌ వెయిటింగ్!
  • whatsapp icon

ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క‌ఛాన్స్ అంటూ బాలీవుడ్ హీరోలే జ‌క్క‌న్న కోసం క్యూలో ఉన్నారు. ఇక హీరోయిన్ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న పిల‌వాలేగానీ రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోవ‌డానికి సిద్దంగా ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ల‌క్కీ ఛాన్స్ కేవ‌లం అలియాభ‌ట్ కి మాత్ర‌మే ద‌క్కింది. హాలీవుడ్ నుంచి చూస్తే ఒలివియో మోరిస్ కి ఆ ఛాన్స్ ద‌క్కింది. ఒలివియో హాలీవుడ్ లో పేరున్న హీరోయిన్ కాదు.

కానీ `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో బ్రిటీష్ యువ‌రాణి పాత్ర‌కు ఆమె అయితే బాగుంటుంద‌ని రాజ‌మౌళి ఏరికోరి మ‌రీ ఖండాలు దాటి మ‌రీ ఆమెను తీసుకొచ్చారు. అలా అనుకోకుండా ఆ ఛాన్స్ ఒలివియోకి ద‌క్కింది. అయితే ఇప్పుడు అదే రాజ‌మౌళి కోసం ఓ ఆస్కార్ హీరోయినే వెయిట్ చేస్తుంది? అన్న సంగ‌తి ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె వెల్ల‌డించింది. ఈ అమ్మ‌డు హాలీవుడ్ లో ఎంతో పేరున్న హీరోయిన్.

అక్క‌డ స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసింది. ఓ సినిమాకి గాను అస్కార్ ఉత్త‌మ న‌టి అవార్డు అందుకుంది. అలాంటి 41 ఏళ్ల నాటి రాజ‌మౌళి పిలిస్తే నేను సిద్దం అనేసింది. న్యూయార్క్‌లో `ది ఐడియా ఆఫ్ యు` ప్రీమియర్‌కు హాజరైన సంద‌ర్భంగా అమ్మ‌డు ఈ విష‌యం రివీల్ చేసింది. `ప్రియాంక చోప్రా త‌న‌తో పాటు న‌టించ‌మ‌న్నా నటిస్తా. ఒక పాట‌లో డాన్స్ చేయ‌మ‌న్నా చేస్తా. ఆమె అడిగితే కాద‌న‌కుండా ఎస్ చెబుతాను.

భార‌తీయ సినిమాల్లో బాగా న‌చ్చిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఆసినిమాని వ్య‌క్తిగ‌తంగా ఎంతో న‌చ్చింది. అందులో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో ప‌నిచేసిన న‌టీన‌టులుతో, సాంకేతిక‌త నిపుణుల‌తో నాకు కూడా క‌లిసి ప‌నిచేయాల‌ని ఉంది`అని మ‌న‌సులో కొర్కెను బ‌య‌ట పెట్టింది. మ‌రి ఈ విష‌యం రాజ‌మౌళి చెవిన ప‌డిందో? లేదా?

ప్ర‌స్తుతం ఆయ‌న సూప‌ర్ స్టార్ మహేష్ క‌థానాయ‌కుడిగా ఆప్రిక‌న్ బ్యాక్ డ్రాప్ లో ఓపాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కించే పనుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. విదేశీ బ్యాక్ డ్రాప్ కాబ‌ట్టి ఇందులో హాలీవుడ్ న‌టుల‌కు ఛాన్స్ ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రి హాలీవుడ్ న‌టుల అవ‌కాశం ప‌డితే అన్నా హ‌త్వేకి ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి

Tags:    

Similar News