బుక్ మై షో రికార్డ్స్.. టాప్ లో ఎవరంటే..

పుష్ప 2 అయితే ఒక్క గంటలోనే 107.6K టిక్కెట్లు అమ్ముడవ్వగా, చావా 2 రెండు రోజుల్లో 61.28K టిక్కెట్‌ సెల్స్‌ను సాధించింది.

Update: 2025-02-17 03:33 GMT

ఆన్ లైన్ బుకింగ్స్ లో ఎప్పటికప్పుడు పాత రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా విడుదలైన చావా 2 బుక్ మై షో లో రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే భారీ రికార్డులు నమోదు చేస్తూ, నేషనల్ వైడ్ హైప్ పెంచుకుంది. మరోవైపు, గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 ఇప్పటికీ టాప్ రికార్డులను బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది. ఈ రెండు సినిమాల టిక్కెట్‌ సెల్స్ ఊహించని స్థాయిలో ఉండటంతో, ఇండస్ట్రీ మొత్తం ఈ ఫిగర్స్‌పై దృష్టి పెట్టింది.

పుష్ప 2 అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో మైల్‌స్టోన్‌లా నిలిచిపోయిన సినిమా. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కి ఉన్న మాస్ క్రేజ్‌, సినిమా మీద భారీ అంచనాలు కలసి వచ్చాయి. విడుదలకు ముందే అన్ని చోట్లా రికార్డులు క్రియేట్ చేస్తుందని అర్థమైపోయింది. ఇప్పుడు విడుదలైన చావా 2 కూడా అదే తరహాలో భారీ హైప్‌తో, ప్రీ బుకింగ్స్‌లో ఊహించని టిక్కెట్ సెల్స్‌తో అదరగొడుతోంది.

పుష్ప 2 అయితే ఒక్క గంటలోనే 107.6K టిక్కెట్లు అమ్ముడవ్వగా, చావా 2 రెండు రోజుల్లో 61.28K టిక్కెట్‌ సెల్స్‌ను సాధించింది. ఇది ఇప్పటివరకు వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాల కంటే ముందుకు ఉండటమే విశేషం. భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల లిస్టులో కల్కి 2898 AD, జవాన్, లియో, ఎనిమల్ వంటి సినిమాలను బట్టి చూస్తే, చావా 2 కూడా అదే లెవెల్‌లో రన్ అవ్వబోతున్నట్టు స్పష్టమవుతోంది.

ఇక ఇప్పటికే రికార్డులు సాధించిన ఇతర సినిమాలను చూస్తే, బుక్ మై షో హిస్టరీలో అత్యధికంగా ఒక గంటలో అమ్ముడైన టిక్కెట్ల లిస్టులో పుష్ప 2 టాప్‌లో ఉండగా, కల్కి 2898 AD రెండో స్థానంలో ఉంది. ఈ మధ్యే వచ్చిన స్ట్రీ 2, టైగర్ 3, గదర్ 2, జైలర్ వంటి సినిమాలు కూడా మంచి ఓపెనింగ్స్‌నే సాధించాయి. కానీ ఇప్పుడు చావా 2 వాటికి తక్కువేం కాదు అనేలా ముందుకు దూసుకుపోతోంది.

బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా అమ్ముడైన టిక్కెట్లు

1. పుష్ప 2 – 1,07,600

2. కల్కి 2898 AD – 95,700

3. జవాన్ – 88,000

4. లియో – 83,000

5. ఎనిమల్ – 80,000

6. స్ట్రీ 2 – 69,230

7. టైగర్ 3 – 66,000

8. గదర్ 2 – 63,000

9. చావా 2 – 61,280

10. జైలర్ – 59,000

Tags:    

Similar News