అకీరా డెబ్యూపై పవన్ అలా డిసైడ్ అయ్యాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవైన డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పవన్ క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీ బిజీగా ఉంటున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవైన డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పవన్ క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగుల్లో పాల్గొంటూ వాటిని పూర్తి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటూ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ డెబ్యూ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు.
అయితే స్టార్ హీరోల వారసులంతా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే పవన్ మాత్రం తన కొడుక్కి ఇంకాస్త వయసొచ్చాక సినిమాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో 2027 తర్వాతే అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడట పవన్.
అకీరా కాస్త పెద్దగా అయితే మ్యాన్లీ లుక్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా బావుంటుందని పవన్ భావిస్తున్నాడట. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో అకీరా డెబ్యూపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే అకీరాను లాంచ్ చేసే బాధ్యతను పవన్, త్రివిక్రమ్ పై పెట్టినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అకీరాకు యాక్టింగ్ కంటే మ్యూజిక్ అంటేనే ఇష్టమని, అకీరా తల్లి రేణూ దేశాయ్ ఇప్పటికే పలుమార్లు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఓజీ కోసం అకీరాతో వర్క్ చేస్తా అని తమన్ కూడా చెప్పాడు. ఏదేమైనా అకీరా యాక్టింగ్ పరంగా సినిమాల వైపు అడుగేయాలంటే మరికొంత టైమ్ పడుతుందని అర్థమవుతుంది. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయినప్పటి నుంచి అకీరా బయట కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాడు. రీసెంట్ గా పవన్ తన భార్య లెజెనొవా, కొడుకు అకీరాతో కలిసి మహా కుంభమేళాకు కూడా వెళ్లగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.