పిక్‌ టాక్ : యోగాసనంలో ఆర్డీఎక్స్‌ బాంబ్‌

పాయల్‌ ఈసారి స్కిన్‌ కనిపించకుండా మొత్తం కవర్ అయ్యే విధంగా డ్రస్ వేసుకుని చాలా క్యూట్ గా యోగా ఆసనం వేసిన ఫోటోను షేర్ చేసింది.

Update: 2024-09-21 13:30 GMT

ఆర్‌ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్‌ గా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌. మొదటి సినిమాలోనే నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ద్వారా పాయల్‌ కి మంచి గుర్తింపు లభించింది. అంతే కాకుండా గ్లామర్‌ డాల్‌ రోల్‌ లోనూ కనిపించడం ద్వారా టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ పాయల్‌ కి ఒక స్థాయి వరకే ఆఫర్లు వచ్చాయి. స్టార్‌ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో అలా అలా కెరీర్‌ ను ముందుకు తీసుకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు తమిళ సినిమాల్లో, ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది.

 

అందాల ఆరబోత పాత్రలను చేయడం ద్వారా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న పాయల్‌ కు ముందు ముందు సైతం ఆ తరహా పాత్రలు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పాయల్‌ రాజ్‌ పూత్‌ సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసేందుకు సైతం సిద్ధంగా ఉంది. ఆ మధ్య సీనియర్‌ స్టార్‌ హీరో వెంకటేష్ తో సైతం కలిసి నటించిన విషయం తెల్సిందే. వచ్చిన అవకాశంను కాదు అనకుండా వరుసగా సినిమా లకు కమిట్‌ అవుతున్న పాయల్‌ రాజ్‌ పూత్‌ సోషల్‌ మీడియాలోనూ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. అయితే ఈసారి క్యూట్‌ యోగా పిక్ ను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

రెగ్యులర్ గా నడుము అందం చూపిస్తూ, క్లీ వేజ్ షో చేస్తూ, స్కిన్‌ షో చేస్తూ ఫోటో షూట్‌ ను షేర్‌ చేసే పాయల్‌ ఈసారి స్కిన్‌ కనిపించకుండా మొత్తం కవర్ అయ్యే విధంగా డ్రస్ వేసుకుని చాలా క్యూట్ గా యోగా ఆసనం వేసిన ఫోటోను షేర్ చేసింది. పద్మాసనంలో పాయల్ కూర్చున్న విధానం ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఆకట్టుకునే అందం పాయల్‌ సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది అంటూ ఫ్యాన్స్‌, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్‌ ఫిట్‌ గా, అందంగా ఉండటం కోసం ఎక్కువ వర్కౌట్స్ చేయడంతో పాటు, ఇలా యోగ ఆసనాలు వేయడం మనం చూస్తూ ఉంటాం.

పాయల్‌ రాజ్‌ పూత్‌ కెరీర్‌ ఆరంభం నుంచి సన్నగా నాజూకుగా కనిపిస్తూ వస్తుంది. క్యూట్‌ గా ఉన్న పాయల్ రాజ్ పూత్‌ కి ఆమె అందానికి తగ్గట్లుగా ఆఫర్లు రావడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌ ముందు ముందు అయినా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంటుదేమో చూడాలి. ఇలా అందమైన ఫోటోలతో కన్నుల విందు చేసిన పాయల్‌ రాజ్‌ పూత్ ముందు ముందు ఆర్డీఎక్స్ లవ్ వంటి రొమాంటిక్, యాక్షన్ సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో పాయల్ ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News