పాయల్ పై డైరెక్టర్ ఏమని కంప్లెంట్ ఇచ్చారంటే?

గ్లామరస్ పాత్రలే కాదు.. ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించుకుంది.

Update: 2024-05-20 14:46 GMT

పాయల్ రాజపుత్.. RX 100 సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అవకాశాలు పెద్దగా దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా మంగళవారం సినిమాతో మంచి హిట్ అందుకుంది. గ్లామరస్ పాత్రలే కాదు.. ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించుకుంది. ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనుంది పాయల్.

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న రక్షణ సినిమాలో పాయల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా విషయంలో తాజాగా పాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

2019-20 టీమ్ లో రక్షణ సినిమా ఒప్పుకున్నానని.. తనకు సక్సెస్ రావడంతో ఆ క్రేజ్ ను వాడుకుని ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని పాయల్ పేర్కొంది. తనకు పెండింగ్ ఉన్న పారితోషికం ఇంకా ఇవ్వలేదని, ప్రమోషన్స్ లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పింది. లేకుంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. తన ప్రమేయం లేకుండా మూవీలో తన పేరు, పాత్ర ఉంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆమె తెలిపింది.

అయితే ఇప్పటికే పాయల్ పై రక్షణ మూవీ డైరెక్టర్ అండ్ నిర్మాత ప్రణ్‌ దీప్ ఠాకూర్.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని TFPC తాజాగా తెలిపింది. మార్చి 28న ఫిర్యాదు అందినట్లు, ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా పేర్కొంది. ఆమె మేనేజర్ తో సంప్రదించి 45 రోజులుగా సమస్య సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రెస్ నోట్ లో వెల్లడించింది. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారన్న వార్తలు దిగ్బ్రాంతి కలిగించినట్లు చెప్పింది.

"ఏప్రిల్ 19న రక్షణ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేశాను. అప్పుడు పాయల్ కు ప్రమోషన్స్ కోసం డేట్స్ అడిగాను. ఆమె సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకోమని సలహా ఇచ్చింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఆమె 50 రోజుల డేట్స్ ఇచ్చింది. 47 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ప్రమోషన్స్ లో కూడా ఆమె పాల్గొనాల్సి ఉంది. కొవిడ్ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేశాను. ప్రమోషన్స్ తర్వాత పెండింగ్ రెమ్యునరేషన్ రూ.6 లక్షలు ఇద్దామనుకున్నాను. కానీ ఏప్రిల్ 4 నే చెక్ వేశాను. అయినా ప్రమోషన్స్ విషయంలో ఆమె స్పందించడం లేదు. పాయల్ అటెండ్ కాకపోతే సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోతాను" అని ఫిర్యాదులో ప్రణ్ దీప్ పేర్కొన్నట్లు TFPC తెలిపింది. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.

Tags:    

Similar News