ఆ సీనియర్ నటి లావైందని కెమారాకి దూరం!
ఒకప్పుడు హీరోయిన్లగా మెప్పించిన వారిలో చాలా మంది సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు గా..కీలకమైన పాత్రల్లోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే
ఒకప్పుడు హీరోయిన్లగా మెప్పించిన వారిలో చాలా మంది సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు గా..కీలకమైన పాత్రల్లోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాధిక.. రమ్యకృష్ణ..మీనా..నదియా.. వాణి విశ్వనాధ్ లాంటి నటీమణులు సినిమాల్లో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే టీవీ సీరియల్స్ లోనూ.. ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లకు హోస్ట్ లు గానూ కొనసాగుతున్నారు. కొంతమంది నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నారు.
మరికొంత మంది వివాహాల అనంతరం విదేశాల్లోనూ స్థిరపడ్డారు. అప్పడుప్పుడు సోషల్ మీడియా కొంత మంది అభిమానులకు టచ్ లోనూ ఉంటున్నారు. అయితే 90వ దశకాలంలోని స్టార్ హీరోయిన్స్ గా రాణించిన రవళి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా రవళి వెలిగిన సంగతి తెలిసిందే. అయితే 2011 నుంచి ఆమె తెరపై కనిపించలేదు. ఆమె సమకాలీకులు చాలామంది కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నారు. కొందరు బుల్లి తెరపైనా బిజీ అయ్యారు. రవళి మాత్రం అడ్రస్ కూడా లేరు.
తాజాగా ఈ విషయాన్ని రవళి అన్నయ్య విజయ్ ముందుకు తీసుకెళ్తే ఆసక్తిర విషయాలు రివీల్ చేసారు. 'హరిత .. రవళి .. నేను .. ముగ్గురం కూడా నటనవైపు వచ్చాం. నాకు .. హరితకి టీవీ సీరియల్స్ మంచి పేరును తెచ్చిపెట్టాయి. రవళి మాత్రం సినిమాల్లో దూసుకుపోయింది. 'పెళ్లిసందడి' .. 'శుభాకాంక్షలు .. ' వినోదం' సినిమాలతో స్టార్ డమ్ చూసింది. హరిత ఒక రోజూ షూటింగ్ లేకపోయినా ఏడ్చేస్తుంది. కానీ రవళి అలా కాదు. తనకి పాప పుట్టిన తర్వాత లావు అయింది. అందువల్ల సినిమాల్లో నటించకూడదని స్వీయా నిర్ణయం తీసుకుంది.
తాను ఎంత బలంగా నిర్ణయం తీసుకుంది! అంటే ఈ విషయంలో మేము ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా ఒప్పుకోలేదు. కనీసం టీవీ షోలు అయినా టైంపాస్ గా చేయ్ అని కోరినా..నో ఛాన్స్ అనేసింది. ఇక తనకి కుటుంబం తప్ప! సినిమా అనే ప్రపంచానికి చాలా దూరంగా వెళ్లిపోయిందని...ఆమె నటించే అవకాశం ఏమాత్రం లేదని' అన్నారు. మొత్తానికి రవళి సినిమాల విషయంలో చాలా బలమైన నిర్ణయం తీసుకుందనే అన్నయ్య మాటల్ని బట్టి తెలుస్తోంది.