తారక్ దంపతులకు పొంగిలేటి వారి ఆహ్వానం!
తారక్ దంపతులకు వెడ్డింగ్ కార్డు అందించి తప్పకుండా వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఎప్పుడు వస్తారు? అసలు వస్తారా? రారా? అన్నది తెలియదు గానీ అభిమానులు మాత్రం జూనియర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఎదురు చూపులు ఎప్పుడు ఫలిస్తాయో! ఆ సంగతి పక్కన బెడితే తాజాగా ఎన్టీఆర్-తెలంగాణ దేవాదాయ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటి అయ్యారు. నిన్నటి రోజును ఇరువురు సమావేశమయ్యారు. అయితే ఇది రాజకీయ భేటి అనుకునేరు. ఇది అలాంటి భేటి కాదు.
పొంగులేటి తన కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం కోసం కుటుంబ సమేతంగా కలిసారు. తారక్ దంపతులకు వెడ్డింగ్ కార్డు అందించి తప్పకుండా వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందు లో తారక్ లక్ష్మీ ప్రణతి కనిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఏప్రిల్ లోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకురావాలనుకున్న షూటింగ్ డిలే అవ్వడంతో వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం 'వార్ -2' షూటింగ్ లోనూ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఆ సినిమా సెట్స్ కి వెళ్లడం హృతిక్ రోషన్ హాజరవ్వడం తెలిసిందే.
తారక్ కోసం చిత్ర యూనిట్ ఎదురు చూస్తుంది. ఈ ఏడాది తారక్ ఈ రెండు సినిమాలతోనే సరిపెడతాడా? కొత్త చిత్రాల ప్రకటన ఏదైనా ఉంటుందా? అన్నది చూడాలి. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ 'సలార్ -2' పూరయ్యే వరకూ ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాదు. సలార్ -2 నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెడతారని సమాచారం.