ప్రభాస్ పవర్ఫుల్ లైనప్… కల్కి 2 కోసం నాలుగేళ్లు ఆగాల్సిందేనా?

డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.

Update: 2024-12-28 10:33 GMT

డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది.

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ కెరియర్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ 10, 2025న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ డేట్ కి రిలీజ్ ఎంత వరకు సాధ్యం అవుతుందనేది క్లారిటీ లేదు.

మేకర్స్ మాత్రం అనుకున్న డేట్ కి ఎట్టి పరిస్థితిలో సినిమాని తీసుకురావాలని అనుకుంటున్నారు. ప్రభాస్ 24వ చిత్రంగా ది రాజాసాబ్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న చిత్రాన్ని ప్రభాస్ ముందుగా తీసుకొని రావాలని అనుకుంటున్నారు. ప్రభాస్ 25వ చిత్రంగా ఈ మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టొరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇమాన్వి ఇస్మాయిల్ ఈ చిత్రంతో ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది. హీరోయిన్ గా ఆమెకిదే మొదటి చిత్రం కావడం విశేషం. ఇక ప్రభాస్ 26వ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రానుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారు.

హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ‘స్పిరిట్’ తెరకెక్కనుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ పార్ట్ 1’ ప్రభాస్ 27వ చిత్రంగా ప్రేక్షకులని పలకరించనుంది. ఈ సినిమా తన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోకి బెస్ట్ గా ఉంటుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పారు.

ఎన్టీఆర్ సినిమా తర్వాత ‘సలార్ పార్ట్ 2’ మూవీ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నింటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి2898ఏడీ పార్ట్ 2’ మూవీ రానుంది. ప్రభాస్ 28వ చిత్రంగా ఆఖరిలో ఈ చిత్రం రాబోతోంది. అంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్ షెడ్యూల్స్ పెట్టిన కూడా ‘కల్కి 2898ఏడీ’ థియేటర్స్ లోకి రావడానికి కనీసం 4 ఏళ్ళు పట్టడం గ్యారెంటీ అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

ది రాజాసాబ్ - 24వ చిత్రం

ప్రభాస్ హను - 25వ సినిమా

స్పిరిట్ - 26వ చిత్రం

సలార్ పార్ట్ 2 - 27వ చిత్రం

కల్కి 2898ఏడీ పార్ట్ 2 - 28వ సినిమా

Tags:    

Similar News