ప్రభాస్ ముగ్గురు సిస్టర్స్‌ని చూశారా..!

తాజాగా ప్రభాస్ ముగ్గురు చెల్లెల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Update: 2025-02-12 05:29 GMT

పాన్‌ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌ సినిమాల గురించి ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. కానీ ఆయన ఫ్యామిలీ గురించి చాలా తక్కువగా మనం వార్తలను చూస్తూ ఉంటాం. రెబల్ స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే టాప్‌ స్టార్‌ హీరోగా నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల మార్కెట్‌ వాల్యూ దాదాపుగా రూ.10 వేల కోట్లు అంటూ ఆయన ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభాస్ రాబోయే 5 ఏళ్లలో చేయబోతున్న సినిమాలు అన్ని వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలు, వేల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అలాంటి ప్రభాస్ గురించి ఏ చిన్న వార్త అయినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది.

తాజాగా ప్రభాస్ ముగ్గురు చెల్లెల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్‌కి సొంత చెల్లెలు లేరు. కానీ కృష్ణంరాజు కుమార్తెలు అయిన ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలను సొంత చెల్లెలు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు. వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభాస్ ప్రమేయం ఉంటుందని అంటారు. వారికి తండ్రి స్థానంలో ఉండి ప్రభాస్ అన్ని తానై చూసుకుంటాడు అనే టాక్‌ ఉంది. ఇటీవల కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి హాజరు అయ్యారు. ఆ కార్యక్రమంలో ప్రభాస్ సైతం పాల్గొనాల్సి ఉన్నా షూటింగ్‌తో బిజీగా ఉన్న కారణంగా ఆయన హాజరు కాలేక పోయారు.

ఆ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ప్రభాస్ ముగ్గురు సిస్టర్స్‌ ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలు తల్లి శ్యామలా దేవితో కలిసి ఇలా ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ చెల్లెలు అంటూ వీరి ఫోటోలను రెబల్‌ ఫ్యాన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత రెబల్‌ సిస్టర్స్ ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా రావడంతో అందరి దృష్టిన ఆకర్షించారు. కృష్ణం రాజుకు కుమార్తెలుగానూ వీరి ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు. వీరిలో ప్రసీద నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. తన తండ్రి ప్రారంభించిన నిర్మాణ సంస్థ బాధ్యతను చూసుకుంది. ప్రభాస్ నటించిన సినిమా నిర్మాణంలోనే భాగస్వామిగా ప్రసీద వ్యవహరించింది.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్‌ సినిమాను ఈ సమ్మర్‌ చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఒక సినిమా రూపొందుతోంది. ఫౌజీ వర్కింగ్‌ టైటిల్‌తో ఆ సినిమా జెట్‌ స్పీడ్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాలు కాకుండా సలార్‌ 2, కల్కి 2 సినిమాలను ప్రభాస్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరిలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నాడు. మొత్తానికి ప్రభాస్ రాబోయే రెండు మూడు ఏళ్లలో వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను షేర్‌ చేయబోతున్నారు.

Tags:    

Similar News