రాజా సాబ్.. ఎంత వరకు వచ్చింది?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ది రాజా సాబ్ ప్రాజెక్ట్ ను ఆయన కంప్లీట్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ది రాజా సాబ్ ప్రాజెక్ట్ ను ఆయన కంప్లీట్ చేస్తున్నారు. హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు కూడా పోషించని రెండు భిన్న కోణాలు ఉన్న పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో ఆ విషయంలో ఆడియన్స్ అండ్ అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
అయితే సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న జాక్ ను కూడా అదే తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో రాజా సాబ్ విడుదల వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం సాగింది.
దీంతో వాయిదాపై నేరుగా స్పందించని మేకర్స్ ఇన్ డైరెక్ట్ గా ఓ పోస్ట్ పెట్టారు. రాజా సాబ్ షూటింగ్ పగలు, రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతోందని, దాదాపు 80 శాతం పూర్తయిందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అంతే వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు అప్డేట్స్ ను తాము అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు.
అయితే ఇప్పుడు రాజా సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని సమాచారం. అవి కూడా త్వరలో పూర్తయిపోతాయట. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో.. సినిమా అనుకున్న తేదీకి వస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. వాయిదా పడే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
ఇక ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్.. హారర్ కామెడీ జోనర్ లో మూవీ చేస్తుండడంతో అంతా వెయిట్ చేస్తున్నారు. సినిమాలో సీజీ వర్క్ అదిరిపోనుందని ఎప్పటి నుంచో టాక్ వస్తోంది. ఆ మధ్య నిర్మాత భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజా సాబ్ లోని కొన్ని సీన్స్.. హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ ను తలపించాయని అన్నారు. మరి చూడాలి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో..