సలార్ లో వాటికి చోటు లేదు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇందులో సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ప్రశాంత్ ఫోకస్ అంతా ఉంది.
ఇక ఈ సినిమాకి కూడా ప్రశాంత్ తన కేజీఎఫ్ సిరీస్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూరు సలార్ కి కూడా సంగీతం అందిస్తున్నారు. దీనిని బట్టి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోందనేది ఒక క్లారిటీకి వచ్చేయొచ్చు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ అయితే సినిమాపై ఇంటెన్షన్ అమాంతం పెంచేసింది. ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
దీంతో సలార్ సినిమా కచ్చితంగా ప్రశాంత్ నీల్ మరిచిపోలేని సక్సెస్ ఫుల్ మూవీగా మారుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ గా హీరో, హీరోయిన్స్ డ్యూయిట్స్ లాంటివి ప్రశాంత్ నీల్ పెట్టలేదంట. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే సినిమా మొత్తానికి ఉంటాయంట. అవి కూడా బ్యాగ్రౌండ్ లో వస్తాయని ఇందులో ఒకటి థీమ్ సాంగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరో సారి ఎలివేషన్ గా వస్తుందంట
బ్యాగ్రౌండ్ థీమ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందంట. ఈ సాంగ్ కేజీఎఫ్ లో రాఖీభాయ్ తరహాలో పాపులర్ కావడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ఐహితే ప్రశాంత్ నీల్ తన సినిమాలు అన్ని కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో చేస్తాడు కాబట్టి సాంగ్స్ కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
సలార్ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుందంట. ఏకంగా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్యలో రాబోతున్న మూవీ ఏ మేరకు వండర్స్ క్రియేట్ చేస్తుందనేది చూడాలి.