SSMB29 ఓపెనింగ్: మహేశ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా?

రేపు జనవరి 2వ తేదీన మహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.

Update: 2025-01-01 12:03 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేశ్ కెరీర్ లో 29వ సినిమా కావడంతో ప్రస్తుతానికి SSMB29 అని పిలుచుకుంటున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని యావత్ సినీ అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా లాంచింగ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్త ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది.

రేపు జనవరి 2వ తేదీన మహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు ఉదయం 10 గంటలకు పూజ జరుగుతుందని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, SSRMB మూవీ ఓపెనింగ్ ఈవెంట్ చాలా ప్రైవేట్‌గా జరగనుందని తెలుస్తోంది. ఇందులో మూవీ టీమ్ మాత్రమే పాల్గొంటారు. మీడియాకి ఆహ్వానం లేదని, ఎలాంటి కవరేజ్ ఉండదని చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా రాజమౌళి ఏదైనా సినిమా మొదలుపెట్టే ముందు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడించడం మనం చూస్తూ వస్తున్నాం. స్టోరీ లైన్ రివీల్ చేసి ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ రెట్టింపు చేయడం దర్శకుడికి అలవాటు. కానీ మహేష్ బాబు మూవీ విషయంలో అలాంటివి ఉండవని టాక్ వినిపిస్తోంది. RRR తర్వాత మహేష్ తో వర్క్ చేయనున్నట్లు జక్కన్న స్వయంగా చెప్పినా.. మేకర్స్ సైడ్ నుంచి ఇప్పటి వరకూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. రేపు లాంఛనంగా సినిమాని ప్రారంభించినా, రాజమౌళి ప్రెస్ మీట్ ఉండదని అంటున్నారు. మీడియా కవరేజ్ కూడా ఉండదని చెబుతున్నారు.

మరోపక్క మహేశ్ బాబు తన సినిమాల ఓపెనింగ్స్ లో పాల్గొనరే సంగతి తెలిసిందే. సెంటిమెంటుగా ఆయన తన సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు సితార లేదా గౌతమ్ లను మాత్రమే సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకి పంపిస్తుంటారు. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతారా? లేదా సెంటిమెంట్ ను బ్రేక్ చేసి పూజా సెర్మనీకి మహేష్ అటెంట్ అవుతారా? ఎప్పటిలాగే సూపర్ స్టార్ తన భార్యా పిల్లలను ఓపెనింగ్ ఈవెంట్ కి పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

SSMB 29 మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ హై-వోల్టేజ్ యాక్షన్‌ అడ్వెంచర్ గా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి. RRR చిత్రానికి వచ్చిన గ్లోబల్ ప్రశంసలను దృష్టిలో పెట్టుకొని, హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. టాప్ నాచ్ టెక్నీషియన్స్, స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో భాగం కానున్నారు. మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని టాక్ నడుస్తోంది.

ఎప్పటిలాగే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 1000 కోట్లకి పైగా బడ్జెట్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రాజమౌళి, మహేష్ బాబు కెరీర్ లోనే కాదు.. ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. మరి త్వరలోనే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన వివరాలను అధికారికంగా వెళ్లడిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News