పుష్ప 2 - ప్రమోషన్ ఖర్చు ఏ రేంజ్ లో ఉందంటే..

టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న చిత్రాల జాబితాలో పుష్ప 2 టాప్ లిస్ట్ లో ఉంది.

Update: 2024-11-18 13:43 GMT

టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న చిత్రాల జాబితాలో పుష్ప 2 టాప్ లిస్ట్ లో ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో మేకర్స్ చూపించిన తెగువ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. గతంలో ఎప్పుడు లేనంత హై రేంజ్ లో ప్రమోషన్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాట్నా లాంటి పట్టణాన్ని ప్రమోషన్ కోసం ఎంచుకోవడం పెద్ద సాహసమే అనిపిస్తుంది, కానీ ఈ నిర్ణయం చిత్రబృందానికి మంచి బూస్ట్ ఇచ్చింది.

ప్రమోషన్స్ కోసం పాట్నా ప్రాంతాన్ని ఎంచుకోవడం భిన్నమైన ఆలోచన. అక్కడ జన సందోహన్ని తట్టుకోవడం సాధ్యమేనా అని అందరు అనుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ కూడా అక్కడ ఈవెంట్స్ చేయడానికి భయపడతారు. కానీ అదే సమయంలో అది విజయవంతమైతే సినిమా పాపులారిటీ మరింత పెరుగుతుందని అంచనా వేశారు. అందుకే రిస్క్ అని తెలిసినా ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్లారు.

ఇక ఈ ఈవెంట్ కోసం మేకర్స్ రూ. 4 కోట్లకు పైగా వెచ్చించారని తెలుస్తోంది. పాట్నాలో ఇలాంటి భారీ ఈవెంట్ నిర్వహించడం అనుభవం లేని ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు పెద్ద పరీక్షగా మారింది. కానీ హైదరాబాద్‌కు చెందిన YouWe Media సంస్థ ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొంది. లోకల్ గా అనుభవం ఉన్నవారి సహాయం కూడా తీసుకొని ఈవెంట్ ను పక్కా ప్రణాళికతో సక్సెస్ చేశారు. ఈవెంట్ నిర్వహణలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి.

స్థానికంగా లగ్జరీ కార్లు, కారవాన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇతర నగరాల నుండి తెప్పించాల్సి వచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి డాన్సర్లు మరియు ఇతర సాంకేతిక బృందాలను తీసుకురావడం, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం పెద్ద ఎత్తున ఖర్చులను పెంచింది. దీంతో ప్రతీ చిన్న అంశం కోసం పది రూపాయల పని కోసం రెండు పదుల కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చింది. మొదట ఈవెంట్ కోసం పాట్నా నగరాన్ని పోస్టర్లు, హోర్డింగ్స్‌తో నింపి, సన్నాహాలు ప్రారంభించారు.

డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొనడం ద్వారా ఈవెంట్‌కు ప్రాముఖ్యత పెరిగింది. స్థానిక కార్పొరేటర్ల సహకారంతో భారీ జనాన్ని సమీకరించారు. పాట్నా వంటి పట్టణంలో ఈ విధంగా ఆడియన్స్‌ను ఆకర్షించడం సరికొత్త ప్రమోషన్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. పాట్నా ఈవెంట్ విజయవంతమైన తర్వాత, పుష్ప 2 టీమ్ మిగతా 6 నగరాల్లో ఈవెంట్లను ప్లాన్ చేసింది. ముంబైలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించగా, దుబాయ్‌లో అంతర్జాతీయ ప్రమోషన్లకు ప్రత్యేక వేడుక ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్ కాంపెయిన్‌ ద్వారా, మేకర్స్ సినిమాకు దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిలో భారీ క్రేజ్‌ను సృష్టించారు. మొత్తంగా మైత్రి వారు ప్రమోషన్ కోసమే ఓ మీడియం రేంజ్ సినిమాకు వెచ్చించినంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News