ఒక్క దెబ్బతో మూడు రికార్డులు

మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా కలెక్షన్స్ వీకెండ్స్ లో మళ్ళీ పిక్ అప్ అయ్యేలా ఉన్నాయని అనుకుంటున్నారు.

Update: 2024-12-21 08:30 GMT

తెలుగు రాష్ట్రాలలో కూడా 'పుష్ప 2' కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు. ఈ సినిమా టికెట్ ధరలు తగ్గించడం వలన ఆడియన్స్ మరల థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. బన్నీ అరెస్ట్ ఘటన తర్వాత సినిమా కలెక్షన్స్ పెరిగాయనే ప్రచారం నడుస్తోంది. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా కలెక్షన్స్ వీకెండ్స్ లో మళ్ళీ పిక్ అప్ అయ్యేలా ఉన్నాయని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే అందరి అంచనాలకి మించి కలెక్షన్స్ వేట సాగిస్తోన్న ఈ మూవీ మరో మైలురాయిని అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో 200 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న మూడో చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది. అలాగే 300 కోట్ల గ్రాస్ దాటిన చిత్రంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. దీని కంటే ముందుగా 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి 2' మాత్రమే ఉన్నాయి.

ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీలో మూడు వందల కోట్ల గ్రాస్ క్లబ్ లో సోలోగా చేరిన హీరోగా అల్లు అర్జున్ ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అంటే ఒక్క దెబ్బతో మూడు రికార్డులు బన్నీ క్రియేట్ చేసాడని చెప్పొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోవడానికి ఇంకా 14 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

వీకెండ్, క్రిస్మస్ హాలిడేస్ లో కలెక్షన్స్ పెరిగిన కూడా ఈ టార్గెట్ ని ఎంత వరకు అందుకోగలదు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిందీ బెల్ట్ లో అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ ని ఇప్పటికే బ్రేక్ చేసిన ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. 'పుష్ప 2' మూవీ ఇంపాక్ట్ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.

అలాగే ఒకప్పుడు కమర్షియల్ సినిమా అని చిన్న చూపు చూసినవారే ఈ సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ చూసిన తర్వాత ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్కెట్ ని శాసించేవి ఈ కమర్షియల్ కథలే అని నిర్మాతలు కూడా నమ్మేలా ఈ చిత్రం చేసింది. భవిష్యత్తులో దర్శకులు కూడా బలమైన కథని కమర్షియల్ అంశాలు జోడించి తెరపై చూపించడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది.

బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా 'పుష్ప 2' తర్వాత కథలని తెరపై ఆవిష్కరించడంలో రూట్ మార్చుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరిపోయిన తెలుగు సినిమాలు నెక్స్ట్ 2000 కోట్ల పైన ఫోకస్ చేస్తారనే టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News