డాటర్ పెద్ద కోడలంటే మురిసిపోతున్న మామ్!
తన కుమార్తె పెద్ద కోడలిగా ప్రమోట్ అయిందని రాధ తెలిపారు. అంటే రోహిత్ మీనన్ ఇంట్లో కార్తిక పెద్ద కోడలు అన్న మాట. ఇకపై ఇంటి బాధ్యతలు ఆమె చూసుకుంటారని తెలుస్తోంది.
వెటరన్ నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ మ్యాన్ రోహిత్ మీనన్ వివాహం చేసుకుని స్థిర పడిన సంగతి తెలిసిందే. నవంబర్ లో కార్తీక వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. తాజాగా కార్తీక- రోహిత్ మీనన్ కొత్తగా వేరు కాపురం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే కొత్త కోడలిగా అడుగు పెట్టిన నా కుమార్తెకి అప్పుడే ప్రమోషన్ కూడా వచ్చిందని రాధ సంతోషం వ్యక్తం చేసారు.
తన కుమార్తె పెద్ద కోడలిగా ప్రమోట్ అయిందని రాధ తెలిపారు. అంటే రోహిత్ మీనన్ ఇంట్లో కార్తిక పెద్ద కోడలు అన్న మాట. ఇకపై ఇంటి బాధ్యతలు ఆమె చూసుకుంటారని తెలుస్తోంది. రోహిత్ కి ఇంకా తమ్ముళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లకింకా పెళ్లి కాలేదు. ఆ ఘట్టం జరిగే వరకూ పెద్ద కోడలిగా అందరి బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత కార్తీక మీదనే ఉంది. ఇక రాధ కు మరో కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు తులసి.
'కడలి' అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ తర్వాత ఆమె కూడా పెద్దగా సినిమాల్లో కనిపించ లేదు. తులసి ఇంకా పెళ్లిచేసుకోలేదు. ఆ బాధ్యత కూడా రాధ నెరవేరిస్తే కుమార్తెల బాధ్యతల నుంచి తప్పుకున్నట్లే. అలాగే రాధ కూడా సినిమాల్లో నటించడం లేదు. ఆమె తరం నటులు కొంత మంది సెకెండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్నా రాధ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. అప్పుడప్పుడు ఈవెంట్లలో కనిపించడం తప్ప! మ్యాకప్ అనే మాటకే ఆమె దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కనీసం కుమార్తెలు అయినా సినిమాల్లో సక్సెస్ అయితే బాగుండేది. తల్లి లెగస్సీని ఇద్దరి లో ఒక్కరు కూడా కొనసాగించలేకపోవడం బాధాకరం. కార్తీక నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే తమిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ రెండు పరిశ్రమల్లోనూ కార్తీక నిలదొక్కుకోలేకపోయింది.