దర్శకుడి కాళ్లుమొక్కిన జక్కన్న.. రెస్పెక్ట్ కా బాప్!

ఎస్ఎస్ రాజమౌళి.. ఇదే పేరు కాదు రాజముద్ర. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వీరుడు. తెలుగు చిత్రస్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు.

Update: 2024-02-21 06:15 GMT

ఎస్ఎస్ రాజమౌళి.. ఇదే పేరు కాదు రాజముద్ర. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వీరుడు. తెలుగు చిత్రస్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు. భారత్ నుంచి తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న మూవీకి డైరెక్టర్ గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. మాస్ కమర్షియల్ మూవీలతో అవార్డుల పంట పండించవచ్చని నిరూపించుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హవా చూపిస్తున్న జక్కన్న.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని రాజమౌళిని చూస్తే అనిపిస్తుంటుందని ఆయన అభిమానులు ఎప్పుడూ అంటుంటారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు కూడా అలానే ప్రవరిస్తుంటారని కొనియాడుతుంటారు. కొందరు డైరెక్టర్లు కొన్నిసార్లు అహంకారం ప్రదర్శించినా.. జక్కన్న ఎప్పుడూ ఒకేలా ఉంటారని చెబుతుంటారు. తాజాగా రాజమౌళి క్యారెక్టర్ కు ప్రతిబింబించేలా జరిగిన ఓ సంఘటనను మలయాళం ప్రొడ్యూసర్ పంచుకున్నారు.

బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి.. అలప్పుజ మార్గం ద్వారా శబరిమలను సందర్శించారట. ఆ సమయంలో స్టార్ యాక్టర్, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ తండ్రి అయిన మలయాళ దర్శకుడు ఫాజిల్ను కలవగలరా అని రాజమౌళి అడిగారట. అందుకు ఫాజిల్ కూడా ఓకే చెప్పారట. దీంతో జక్కన్న ఆయనను కలవడానికి వెళ్లారట. అయితే ఫాజిల్.. మలయాళంలో మంచి చిత్రాలను తెరకెక్కించారు.

అయితే ఫాజిల్ ను కలిసిన వెంటనే రాజమౌళి ఆయన పాదాలకు నమస్కరించారట. దీంతో ఒక్కసారిగా ఫాజిల్ కూడా షాక్ అయ్యారట. దేశమంతా బాహుబలి కోసం మాట్లాడుకుంటున్న సమయంలో రాజమౌళి తన కాళ్లు మొక్కడం చూసి ఫాజిల్ ఆశ్యర్యపోయారట. ఫాజిల్ సినిమాలే తనకు స్ఫూర్తి అని జక్కన్న ఆ సమయంలో చెప్పారట. ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్న ఓ మలయాళం ప్రొడ్యూసర్ ఇటీవలే ఆ విషయాన్ని చెప్పారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాజమౌళి.. మిగతా దర్శకులను రెస్పెక్ట్ ఇస్తారన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తీసే కన్నా ముందు ఓ ఇంటర్వ్యూలో దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్ పై మాట్లాడారు. వారిద్దరి దగ్గర చాలా స్టఫ్ ఉందని చెప్పారు. మంచి ఫోకస్ చేసి భారీ మాస్ చిత్రాలు చేస్తే తాము సర్దుకోవాల్సిందే అనిపించే దర్శకులంటూ కొనియాడారు. మొత్తానికి రాజమౌళి రెస్పెక్ట్ కా బాప్ అన్నమాట!

Tags:    

Similar News