ఎన్టీఆర్‌, చరణ్‌ లకు జక్కన్న సెంటిమెంట్‌...!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు కలిసి నటించారు

Update: 2024-03-06 16:30 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు కలిసి నటించారు. ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి నటించడం టాలీవుడ్‌ లో సాధ్యం కాదు.. ఒక వేళ నటించిన కూడా చాలా గొడవలు అవుతాయి అని చాలా మంది చేసిన వ్యాఖ్యలు తప్పు అయ్యేలా ఆర్‌ఆర్ఆర్‌ సినిమా నిలిచింది.

రాజమౌళి ఏ ఒక్కరిని తక్కువ చేయకుండా ఇద్దరు హీరోలను కూడా అద్భుతంగా చూపించి రికార్డులు క్రియేట్‌ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఏ హీరో అయినా తదుపరి కాస్త ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌, చరణ్ లు కూడా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు అనిపిస్తోంది.

రామ్ చరణ్‌ గేమ్‌ చేంజర్ ప్రారంభించి చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో అయినా విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మొదలయింది. ఏప్రిల్‌ లో విడుదల అవ్వాల్సిన దేవర అక్టోబర్‌ కి వాయిదా పడింది.

ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఇద్దరు హీరోల సినిమాలు కూడా అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఆ సినిమాల విషయం పక్కన పెడితే ఎన్టీఆర్‌ దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో జత కట్టాడు. ఇప్పుడు రామ్‌ చరణ్ కూడా తన బుచ్చిబాబు సినిమా కోసం జాన్వీ కపూర్‌ ను లైన్‌ లో పెట్టాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చేసిన పుణ్యమా అని ఈ ఇద్దరు హీరోలకు జక్కన్న సెంటిమెంట్‌ రిపీట్ అవుతుంది. అంతే కాకుండా చాలా విషయాల్లో ఇద్దరికి ఒక్కటే జరుగుతుంది. ముందు ముందు ఈ స్నేహితులు మరెన్ని విషయాల్లో పోలికలతో ముందుకు వస్తారో చూడాలి.

Tags:    

Similar News