రానా నాయుడు 2 టీజర్ టాక్..!

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి చేసిన క్రేజీ వెబ్ సీరీస్ రానా నాయుడు.

Update: 2025-02-03 12:31 GMT

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి చేసిన క్రేజీ వెబ్ సీరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమన్, సువర్ణ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. రెండేళ్ల క్రితం వెబ్ సీరీస్ లో టాప్ లిస్ట్ లో నిలిచి సూపర్ సక్సెస్ అందుకున్న రానా నాయుడు. ఇప్పుడు రెండో సీజన్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతుంది. రానా నాయుడు సీరీస్ లో వెంకటేష్, రానా ఇద్దరు తండ్రి కొడుకులుగా నటించారు.

ఐతే మొదటి సీజన్ కాస్త భూతులు ఎక్కువ అయ్యాయన్న టాక్ వచ్చింది. ఐతే మరో విషయం ఏంటంటే రానా నాయుడు సీరీస్ అంత బాగా సక్సెస్ అవ్వడానికి అవే ప్రధాన కారణంగా నిలిచాయి. రానా నాయుడు సీరీస్ తెలుగు వెర్షన్ అయితే మన వెంకీ మామ ఏంటి బోండాలు గురించి మాట్లాడటం ఏంటని అనుకున్నారు. ఐతే అలా చర్చల్లో ఉంటూ కూడా సెరీస్ ని సూపర్ హిట్ చేశారు.

ఇక ఇప్పుడు రానా నాయుడు రెండో సీజన్ కి ముహూర్తం వచ్చింది. సీరీస్ ని సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ లేటెస్ట్ గా టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు. రానా నాయుడు 2 టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ టీజర్ లో ఎక్కువ కథ కన్నా యాక్షన్ పార్ట్ ని చూపించారు. కొన్ని యుద్ధాలు కొనసాగుతాయి అంటూ రానా వర్సెస్ వెంకటేష్ ఫైట్ ఈ సీజన్ లో కూడా కొనసాగుతుందని హింట్ ఇచ్చారు.

రానా నాయుడు సీరీస్ లో వెంకటేష్ పూర్తిగా తన ఇమేజ్ కి భిన్నంగా కనిపించారు. సీజన్ 2 లో కూడా అదే తరహా పాత్ర ఉండబోతుంది. రానా నాయుడు 2 సౌత్ ఆడియన్స్ కన్నా నార్త్ సైడ్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు సీజన్ 2 టీజర్ కి కూడా వారి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న రానా నాయుడు సీజన్ 2 కచ్చితంగా మొదటి సీజన్ ని మించి ఉంటుందని టీజర్ శాంపిల్ చూస్తేనే అర్థమవుతుంది. ఐతే ఈ సీజన్ లో భూతులను కాస్త కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుంది. సీజన్ 2లో రానా పాత్ర మరింత బలంగా ఉండేలా కనిపిస్తుంది.

Full View
Tags:    

Similar News