రానా మూవీ క్యాన్సిల్.. కారణం అదేనా?

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి.. ఇటీవల 35- చిన్న కథ కాదు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-09-13 19:30 GMT

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి.. ఇటీవల 35- చిన్న కథ కాదు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఆయన నటించలేదు.. ప్రొడ్యూస్ మాత్రమే చేశారు. చివరగా విరాటపర్వంతో హీరోగా అలరించిన ఆయన.. ఇప్పటి వరకు మరో సినిమాతో సందడి చేయలేదు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి ప్రస్తుతం కాంతలో నటిస్తున్నారు. రానా నాయుడు-2 వెబ్ సిరీస్ షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నారు.


అయితే గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా రానా.. రాక్షస రాజా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా అప్పుడు రిలీజ్ చేశారు. అందులో రానా రెట్రో యాక్టివ్ గా కనిపిస్తూ అందరినీ మెప్పించారు. ఊర మాస్ లుక్ లో సందడి చేసి.. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని కొందరు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ మరికొందరు రానా పోస్టర్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు.

అప్పటికే తేజ-రానా కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రాక్షసరాజాపై హోప్స్ గట్టిగానే పెట్టుకున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ డ్రామాగా సినిమా రూపొందుతోందని, ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ నేర ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నామని మేకర్స్ అప్పుడు తెలిపారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను రానా పూర్తిగా పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా మూవీ రద్దయినట్లు సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రియేటివ్ డిఫరెన్సెసే కాకుండా మరో కారణం కూడా ఉన్నట్లు అనిపిస్తుందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. తేజ తెరకెక్కించిన చివరి చిత్రం అహింస బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. రానా తమ్ముడు అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తేజా ఆ సినిమా తెరకెక్కించారు. కానీ ఫస్ట్ మూవీతో డిజాస్టర్ అందుకున్నారు అభిరామ్. అహింస తర్వాత మరో మూవీని స్టార్ట్ చేయలేదు తేజ.

పాన్ ఇండియా స్టార్ అయ్యాక.. రానా కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా రానా నాయుడు వెబ్ సిరీస్ తో అలరించినా.. కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే తేజ చివరి చిత్రం కూడా ఫ్లాప్ గా మారడంతో దానిని కూడా రానా దృష్టిలో పెట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి రాక్షసరాజా అయితే రద్దు అయిపోయినట్లు సమచారం. సినిమాల పరంగా ఆయన చేతిలో కాంత ఒక్కటే ఉంది. మరి రానా కొత్త మూవీతో ఎప్పుడు వస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News