స‌మంత రూత్‌లెస్ ప్ర‌భు.. రానా కామెంట్..!

''సమంత టాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్ళింది.. నా కోడలు నుండి చెల్లి వరకు వెళ్ళింది(మారింది)'' అని రానా వ్యాఖ్యానించడంతో సమంత చాలా న‌వ్వుకున్నారు.

Update: 2024-11-06 12:58 GMT

ఇటీవల జరిగిన IIFA 2024 ఉత్సవంలో సమంతా రూత్ ప్రభు 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నారు. ఈవెంట్ కి హోస్ట్ చేస్తున్న రానా దగ్గుబాటి సామ్ వేదిక నుండి బయలుదేరే ముందు కొద్దిసేపు చాటింగ్ సెష‌న్‌లో త‌న‌తో స‌ర‌దాగా ముచ్చటించారు. ఆ ఇద్దరు స్టార్లు చాలా కాలంగా స్నేహితులు. ఆ స‌మ‌యంలో రానా స‌ర‌దాగా మాట్లాడుతూ సామ్ ని ఆటపట్టించాడు. మాటా మంతీ సమయంలో అతడు చాలా కాలంగా ''సమంత రూత్ లెస్ ప్ర‌భు' అని పిలిచేవాడినని కూడా వెల్లడించాడు. ఆ సంద‌ర్భంలో స‌మంత ముఖంలో చిరున‌వ్వు క‌నిపించింది.

సమంతా విక్కీ కౌశల్ నుండి అవార్డును అందుకుని వేదిక‌పై ఎమోష‌న‌ల్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో విరామం తీసుకున్నాన‌ని, తిరిగి సినిమాల్లోకి రావ‌డం గురించి భావోద్వేగ ప్రసంగం చేసారు. స్టేజి నుండి నిష్క్రమించబోతుండగా స‌మంత‌తో క్లుప్త‌మైన సంభాష‌ణ‌ల‌తో రానా ద‌గ్గుబాటి అంద‌రినీ న‌వ్వించాడు.

''సమంత టాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్ళింది.. నా కోడలు నుండి చెల్లి వరకు వెళ్ళింది(మారింది)'' అని రానా వ్యాఖ్యానించడంతో సమంత చాలా న‌వ్వుకున్నారు. ఈమధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించగా.. నేను సినిమా చేస్తే 'రానా నాయుడు'లా కాకుండా 'నరసింహానాయుడు'లా ఉండాలి అని బదులిచ్చింది. కానీ రానా మాత్రం తనలోని జోష్ ని ఆప‌లేదు. ''అది సినిమా కాదు సోదరి, ఇది ఒక ప్రదర్శన. మీరు ఏదైనా చేయగలరని వారు నాకు చెప్పారు.. నేను ఫ్యామిలీ మ్యాన్ నుండి నేర్చుకున్నాను'' అని అతడు స‌రదాగా వ్యాఖ్యానించాడు. ఈ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు మ‌రోసారి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

రానా దగ్గుబాటి - నాగ చైతన్య బంధుత్వం గురించి తెలిసిన‌దే. నాగ‌చైత‌న్య త‌ల్లిగారు రానాకు మేన‌త్త‌. తండ్రి సోద‌రి. ద‌గ్గుబాటి రామానాయుడుకి చైతూ త‌ల్లి గారు కుమార్తె. అలా సమంత‌తో బంధుత్వం ఉంది. సమంత విడాకుల తర్వాత కూడా రానా స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

Tags:    

Similar News