వాళ్లిద్దరి పాలిట రష్మిక అదృష్ట దేవతవ్వాలా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎదురు లేకుండా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో పాన్ ఇండియాలోనే అమ్మడు ఓ బ్రాండ్ గా మారిపోయింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎదురు లేకుండా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో పాన్ ఇండియాలోనే అమ్మడు ఓ బ్రాండ్ గా మారిపోయింది. టాలీవుడ్ అయినా..బాలీవుడ్ అయినా? రష్మిక సినిమా చేసిందంటే? అదో బ్రాండ్ గా మారిపోతుంది. `యానిమల్` లో రణబీర్ కి కపూర్ కి జోడీగా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల వసూళ్లను సాధించింది.
రణబీర్ కపూర్ కి ఇమేజ్ ని తెలుగులోనే పెంచింది. ఇక `పుష్ప-2` లో శ్రీవల్లిగా అమ్మడు ఏ రేంజ్ లో పెర్పార్మెన్స్ ఇచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. నటనతో పాటు `ఫీలింగ్స్ ఫీలింగ్స్` అంటూ ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా ఏకంగా `బాహుబలి2` రికార్డులనే చేరిపేసింది. బాక్సాఫీస్ వద్ద 1870 కోట్లకు పైగావ సూళ్లను సాధించింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన `ఛావా`తో కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
ఏసుబాయి పాత్రలో రష్మిక నటన నటిగా మరో మెట్టు పైన నిలబెట్టింది. ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వరుస విజయాల్లో ఉన్న విక్కీ కౌశల్ ని ఈ విజయం మరింత గొప్ప స్థానంలో నిలబెట్టింది. ఇలా వరుసగా రష్మిక మొత్తంగా 3000 కోట్లకు పై వసూళ్ల ప్రాజెక్ట్ ల్లో భాగమైంది. వాటిలో రష్మిక పాత్ర ఎంతో కీలకమైందన్నది కాదనలేని నిజం. దీంతో రష్మిక పై బరువైన బాధ్యత పడింది.
ప్రస్తుతం రష్మిక-సల్మాన్ ఖాన్ జంటగా మురగదాస్ `సికిందర్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ ఇది. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అయితే సల్మాన్ ఖాన్ -మురగదాస్ ఇద్దరు ప్లాప్ ల్లోనే ఉన్నారు. కొంత కాలంగా వారు చేస్తోన్న ప్రయత్నాలేవి బాక్సాఫీస్ వద్ద ఫలించడం లేదు.
ఇంకా చెప్పాలంటే `టైగర్ 3` తర్వాత సల్మాన్ కి సరైన హిట్ ఒక్కటీ లేదు. `సర్కార్` తర్వాత మురగదాస్ కి కూడా సక్సెస్ పడలేదు. ఆ తర్వాత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ రష్మిక తనలో సక్సెస్ సెంటిమెంట్...లక్ ని షేర్ చేయాల్సిన సమయం ఇది. రష్మిక సక్సెస్ వేవ్ లో భాగంగా `సికిందర్` కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.