మామ్ మాటల్లో సితార హీరోయిన్ అవ్వడం ఖాయమేనా!
సూపర్ స్టార్ మహేష్ -నమ్రతల కుమార్తె సితార కు సినిమాలంటే ఎంత ఆసక్తి అన్నది చెప్పాల్సిన పనిలేదు.;

సూపర్ స్టార్ మహేష్ -నమ్రతల కుమార్తె సితార కు సినిమాలంటే ఎంత ఆసక్తి అన్నది చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే మహేష్ పాటలకు డాన్సులు చేసింది. పెరిగి పెద్దైన తర్వాత సోషల్ మీడియాలోనూ తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేస్తూ ఎన్నో డాన్సు వీడియోలు చేసింది. ఓ సినిమాలో డాడ్ తో కలిసి డాన్సు కూడా చేసింది. కానీ నిడివి ఎక్కువ అవ్వడంతో సితార ఎపిసోడ్ కట్ చేసారు.
లేదంటే? సితార ఎంట్రీ అప్పుడే షురూ అయ్యేది. ఇక నటిగా కంటే ముందుగా బ్రాండ్ అంబాసిడర్ గాను మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యూయలరీ యాడ్ చేసింది. అలాగే కమర్శియల్ యాడ్స్ లోనూ కని పిస్తుంది. ఇటీవలే డాడ్ మహేష్ తో కలిసి బట్టల షాపింగ్ కి సంబంధించిన యాడ్ కూడా చేసింది. ఆ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో సితార ను చూసి ఒక్క క్షణం స్టన్ అయిపోయారు.
ఆమె సితారా? నమ్రత అని ఆలోచనలో పడ్డారంతా. అచ్చంగా అమ్మ పోలికలనే పోలి ఉంది. తాజాగా ఓ సమావేశంలో సితారను సినిమా ఎంట్రీ గురించి ప్రశ్నించగా సితార మామ్ వైపు నవ్వుతూ చూస్తూ చెప్పాలా? వద్దా? అని ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. వెంటనే నమ్రత మైక్ అందుకుని `సితార వయసిప్పుడు 12 ఏళ్లు. ఈ విషయం గురించి ఆలోచించచడానికి ఇంకా చాలా సమయం ఉంది` అని అన్నారు.
దీంతో సితార ఫ్యాషన్ ని గుర్తించి తల్లిదండ్రులిద్దరు సితారను సినిమా రంగంలోకి తీసుకొచ్చే అవకాశా లున్నాయని నెటి జనులు భావిస్తున్నారు. సినిమాల గురించి అడగగా సితార ఆ కారణంతోనే మామ్ వైపు చూసి సైగ చేసిందని అంటున్నారు. సితార ఫ్యాషన్ ని గుర్తించి సినిమాల్లోకి తీసుకోరావాలని ఘట్టమనేని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే సితార చదువులు పూర్తి చేయాలి. ఆ తర్వాతే తల్లిదండ్రులు సినిమాల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారు.
సితార ఇటీవల పలు యాడ్ ఫిల్మ్‌లు చేస్తుండడంతో సహజంగానే ఈ ప్రశ్న తలెత్తింది. ఇటీవల వైరల్ అయిన ఒక యాడ్‌లో ఆమె మహేష్‌తో కలిసి కనిపించింది. అయితే ఆమె సినీ రంగ ప్రవేశం విషయానికి వస్తే.. అది జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది.
మహేష్ బాబు మరియు రాజమౌళి కలయికలో కొనసాగుతున్న SSMB29 గురించి వ్యాఖ్యానించమని అడిగినప్పుడు, నమ్రత, "నిశ్శబ్దమే ప్రస్తుతానికి ఉత్తమ ఫార్ములా" అని అన్నారు. ఆమె స్పష్టంగా సినిమా గురించి పెదవి విప్పింది మరియు అర్థమయ్యేలా ఉంది.
అదనంగా, ఈ రోజుల్లో గౌతమ్, మహేష్ మరియు నమ్రత కుమారుడు కూడా లైమ్‌లైట్‌ను హాగ్ చేస్తున్నాడని గమనించవచ్చు. తాజాగా ఓ యువకుడు తీసిన షార్ట్ ఫిల్మ్ వైరల్‌గా మారింది. ఘట్టమనేని కుటుంబ వారసులు త్వరలో తెరపైకి రానున్నారని తెలుస్తోంది.