రిషబ్ శెట్టి ఫ్యామిలీకి శత్రువుల ముప్పు..!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి శత్రువుల నుంచి ముప్పు ఉందని పంజుర్లీ వారాహి దేవి చెప్పింది.;

కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి శత్రువుల నుంచి ముప్పు ఉందని పంజుర్లీ వారాహి దేవి చెప్పింది. మంగుళూరులో జరుగుతున్న కద్రి బరెబైల్లో వార్షిక ఉత్సవాలకు రిషబ్ శెట్టి అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో పంజుర్లీ దేవికి వెల్లడించారు రిషబ్ శెట్టి. ఐతే దేవి నీకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు.. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీకు మీ ఫ్యామిలీకి శత్రువుల ముప్పు ఉందని అన్నారట. ఐతే ఎలాంటి హాని జరగకుండా తాను చూసుకుంటానని 5 నెలల్లో మంచి చేస్తానని రిషబ్ శెట్టికి అభయం ఇచ్చారట.
అంతకుముందు వరకు కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చిన రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. అందులో తను కూడా ఇలా వారాహి దేవి తరహా పాత్రలో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన కాంతారా సినిమా 400 కోట్లను వసూళు చేసింది. కాతారా సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతారా 2 చేస్తున్నాడు రిషబ్ శెట్టి.
కాంతారా సినిమాలో నటించడమే కాదు ఆ సినిమాను డైరెక్ట్ చేసి అదరగొట్టారు రిషబ్ శెట్టి. కాంతారాలో అతని నటనకు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు రిషబ్ శెట్టి. ఐతే కాంతారా 2 సినిమా చేస్తున్న రిషబ్ శెట్టికి దేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో మంగుళూరులో జరిగిన దేవుడి వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
కాంతారా 2 కోసం కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. కాంతారా 2 తో పాటుగా హనుమాన్ సీక్వెల్ గా చేస్తున్న జై హనుమాన్ సినిమాలో కూడా రిషబ్ శెట్టి నటిస్తున్నారు. జై హనుమాన్ లో హనుమంతుడిగా రిషబ్ అదరగొట్టబోతున్నారు. ఐతే కాంతారా 2 ని పూర్తి చేసిన తర్వాత జై హనుమాన్ కి డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు రిషబ్ శెట్టి. ఇదే కాది రిషబ్ శెట్టికి తెలుగు, తమిళ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఐతే కాంతారా సూపర్ హిట్ అవ్వడంతో తన నెక్స్ట్ సినిమా కాంతారా 2 నే రిలీజ్ చేయాలని చూస్తున్నారు రిషబ్ శెట్టి. అసలైతే కాంతారా 2 ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సినిమా ఇంకా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది.