2026లో సినిమాలే సినిమాలు.. అసలైన కిక్కు పక్కా!
కానీ 2026లో మాత్రం సినిమాలే సినిమాలు.. తెలుగు టాప్ హీరోలంతా అనేక మంది థియేటర్లలో సందడి చేయనున్నారు.;

సాధారణంగా టాప్ హీరోల సినిమాలపై ఎప్పుడూ ఫుల్ హోప్స్ ఉంటాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అయితే 2025లో బడా హీరోలు తమ సినిమాలతో చేసే సందడి కాస్త తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో టాప్ హీరోల మూవీలు రిలీజ్ అయినట్లు కనబడట్లే.
కానీ 2026లో మాత్రం సినిమాలే సినిమాలు.. తెలుగు టాప్ హీరోలంతా అనేక మంది థియేటర్లలో సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది రంగంలోకి దిగేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఫస్ట్ సంక్రాంతి సీజన్ కాగా.. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా అప్పుడే రిలీజ్ అవ్వనున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. పక్కగా పొంగల్ కు చిరు మరోసారి రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మార్చిలో నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రాలు రిలీజ్ కానున్నాయి. రెండు పక్క పక్క తేదీల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్.. సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు.
ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- హను రాఘవపూడి సినిమా.. సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ.. సమ్మర్ టైమ్ లోనే విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కనున్న మూవీ కూడా 2026లో రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా.. 2027లో రిలీజ్ అవ్వనున్నట్లు ముందు టాక్ వినిపించింది. ఇప్పుడు 2026 చివర్లో అని అంటున్నారు.
ఇవి కాకుండా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సినిమాలు కచ్చితంగా రానున్నాయి. అలా మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ.. తమ మూవీలతో సందడి చేయడం దాదాపు కన్ఫర్మే. నెల రోజుల గ్యాప్ లో ఒక్కో మూవీ విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. అవి కాకుండా మిడ్ రేంజ్, చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. దీంతో 2026లో మూవీ లవర్స్ కు పండుగే.