'లైలా'కి వాలంటైన్స్‌ డే రీ రిలీజ్‌ టెన్షన్‌!

లైలా సినిమా పాజిటివ్‌ బజ్‌ ను క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తండేల్‌ సినిమాతో పాటు మూడు పాత సినిమాలు టెన్షన్ పెడుతున్నాయి.

Update: 2025-02-12 05:58 GMT

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్‌ సినిమా గత వారం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వారంలోనూ తండేల్‌ సినిమా వసూళ్లు కొనసాగుతున్నాయి. వీకెండ్‌లో తండేల్‌కి మరోసారి భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఈ వారంలో విశ్వక్‌ సేన్ హీరోగా నటించిన 'లైలా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశ్వక్‌ సేన్ మొదటి సారి లేడీ గెటప్‌ లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు, ఆసక్తి పెరిగింది. విభిన్నమైన కంటెంట్‌తో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందినట్లు చెబుతున్నారు. లైలాతో పాటు రాజా గౌతమ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన 'బ్రహ్మా ఆనందం' సినిమా సైతం విడుదల కాబోతుంది.

లైలా సినిమా పాజిటివ్‌ బజ్‌ ను క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తండేల్‌ సినిమాతో పాటు మూడు పాత సినిమాలు టెన్షన్ పెడుతున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా సూపర్‌ హిట్‌ ప్రేమ కథా చిత్రాలను రీ రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు. ముఖ్యంగా రామ్‌ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఆరెంజ్‌' సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాకు దాదాపు 10 వేల టికెట్లు బుక్ మై షో ద్వారా అడ్వాన్స్ బుక్‌ అయ్యాయని సమాచారం. మరో వైపు స్టార్‌ బాయ్‌ సిద్దు జొన్నలగడ్డ నటించిన కృష్ణ అండ్‌ హిజ్ లీలా సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్‌ పేరుతో రీ రిలీజ్‌ చేస్తున్నారు. టిల్లుతో అలరించిన సిద్దు సినిమా రీ రిలీజ్‌కి కచ్చితంగా మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి.

ఇక తమిళ్ స్టార్‌ హీరో సూర్య నటించిన 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌' సినిమాను సైతం ఈ వీకెండ్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను రీ రిలీజ్ ప్లాన్‌ చేశారు. ఈ మూడు పాత సినిమాలు ఈ వారం రాబోతున్న లైలా సినిమాకు గట్టి పోటీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలతో పాటు తండేల్‌ సైతం ఈ వారం స్ట్రాంగ్‌గా నిలబడితే 'లైలా' సినిమాకి వసూళ్ల విషయంలో కాస్త ఇబ్బంది తప్పదని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన లైలా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్‌ కావడంతో పాటు యూనిట్‌ సభ్యులు చేస్తున్న ప్రమోషన్స్‌ కలిసి వచ్చి సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

రామ్‌ చరణ్ ఆరెంజ్‌ సినిమా రెండేళ్ల క్రితం రీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి కూడా దాదాపు రూ. కోటి వసూళ్లు సాధించడం ఖాయం అనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ వాలెంటైన్స్ డేకి చక్కని ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ అవుతూ ఉంటే, మరో వైపు అద్భుతమైన ప్రేమ కథా చిత్రం తండేల్‌ ఆడుతూ ఉంటే కామెడీ సినిమా అయిన లైలా సినిమాను జనాలు ఏ మేరకు పట్టించుకుంటారు అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్‌ వస్తే ఎంత పోటీ ఉన్నా లైలాకి మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి. విశ్వక్‌సేన్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్‌తో మినిమం ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News