రీ-రిలీజ్ కలెక్షన్ల హవా.. ఇండియాలో టాప్ 10 మూవీస్ ఇవే!

రీ-రిలీజ్‌లో పలు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ దుమ్ము దులిపే స్థాయిలో వసూళ్లు రాబడుతున్నాయి.

Update: 2025-02-13 14:20 GMT

రోజురోజుకు సినిమాల ట్రెండ్ చాలా వరకు మారిపోతోంది. పాత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రావడం, వాటికి కొత్తగా ప్రేక్షకులు వచ్చే ట్రెండ్ బలపడుతోంది. రీ-రిలీజ్‌లో పలు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ దుమ్ము దులిపే స్థాయిలో వసూళ్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా పండుగలు, హీరోల బర్త్‌డేలు, స్పెషల్ ఈవెంట్స్‌కు పాత బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ ట్రెండ్ చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ విస్తరించింది.

ఒకప్పుడు థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ వల్ల చాలా సినిమాలకు రెండో జన్మ లభిస్తోంది. ఎప్పుడో థియేటర్లలో డిజాస్టర్‌గా మిగిలిన సినిమాలు, ఓటీటీల ద్వారా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించి రీ-రిలీజ్ సమయంలో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లో ఇప్పుడు పలు సినిమాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.

ఈ ట్రెండ్‌లో టాప్‌లో నిలిచిన సినిమా ‘తుంబాడ్’. మొదటి సారి ఈ సినిమా సాధించిన వసూళ్లకు మించి రెండోసారి రీ-రిలీజ్‌లోనే భారీ కలెక్షన్స్ రాబట్టింది. తక్కువ బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఈ హారర్ ఫాంటసీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. టాప్ ఇండియన్ రీ-రిలీజ్‌ గ్రాసర్స్ లో ఏకంగా 37.5 కోట్ల వసూళ్లు సాధించి టాప్ పొజిషన్‌లో నిలిచింది. సోషల్ మీడియాలో ‘తుంబాడ్’పై క్రేజ్, హారర్, థ్రిల్లర్ మూవీ లవర్స్ నుంచి వచ్చిన మద్దతు ఈ సినిమా రీ-రిలీజ్ సక్సెస్‌కు కీలకం అయింది.

తాజా రీ-రిలీజ్ సినిమాల్లో ‘సనం తేరీ కసమ్ (Sanam Teri Kasam)’ గట్టిగా దూసుకుపోతోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 28.3 కోట్ల వసూళ్లు సాధించి రీ-రిలీజ్ చరిత్రలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ప్రేమకథా చిత్రం మొదటిసారి విడుదలైనప్పుడు పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయినా, రీ-రిలీజ్‌లో యూత్ నుంచి భారీ రెస్పాన్స్ రావడం విశేషం. మరోవైపు, హాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘ఇంటర్‌స్టెల్లార్ (Interstellar)’ కూడా రీ-రిలీజ్‌లో కేవలం 6 రోజుల్లో ₹18.3 కోట్ల వసూళ్లు సాధించి టాప్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

హాలీవుడ్ సినిమాలు కూడా రీ-రిలీజ్ ట్రెండ్‌లో భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ‘టైటానిక్ 3D’ 18 కోట్లతో నిలవగా, ఎప్పుడో విడుదలైన ‘అవతార్’ రీ-రిలీజ్‌లో 10 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాకుండా, ‘యే జవానీ హై దీవానీ’ వంటి రొమాంటిక్ డ్రామాలు కూడా రీ-రిలీజ్‌లో 25.4 కోట్ల వసూళ్లు సాధించి టాప్ 5లో స్థానం దక్కించుకున్నాయి.

ఇండియన్ బాక్సాఫీస్‌లో అత్యధిక రీ-రిలీజ్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు:

1. తుంబాడ్ : ₹37.5 కోట్లు

2. సనం తేరీ కసమ్ : ₹28.3 కోట్లు (6 రోజులు)

3. ఘిల్లి: 26.5 కోట్లు

4. యే జవానీ హై దీవానీ : ₹25.4 కోట్లు

5. ఇంటర్‌స్టెల్లార్: ₹18.3 కోట్లు (6 రోజులు)

6. టైటానిక్ 3D: ₹18 కోట్లు

7. షోలే 3D: ₹13 కోట్లు

8. లైలా మజ్ను : ₹11.6 కోట్లు

9. రాక్‌స్టార్: ₹11.5 కోట్లు

10. అవతార్: ₹10 కోట్లు

ఈ లిస్ట్‌లో విజయ్ ఘిల్లి మాత్రమే దక్షిణాది నుంచి టాప్ 10లో నిలవడం విశేషం. టాలీవుడ్ నుంచి కూడా త్వరలో మరిన్ని రీ-రిలీజ్ సినిమాలు ఈ లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రీ-రిలీజ్ ట్రెండ్ ఇలానే కొనసాగితే, పాత సినిమాలు బాక్సాఫీస్‌ను కొత్త ఊపుతో దుమ్ము దులిపే రోజులు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News