రాజమౌళి ఫస్ట్ ఫ్లాప్ తప్పదేమో?

కానీ తాజాగా “RRR: బిహైండ్ & బియాండ్” అనే డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-12-18 07:02 GMT

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కించినా అది ఘన విజయం సాధిస్తుంది. "బాహుబలి" సిరీస్ తరువాత, ఆయన పేరు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. అయితే, "రౌద్రం రణం రుధిరం" (RRR) చిత్రంతో ఆయన గ్లోబల్ స్టార్ దర్శకుడిగా మారారు. హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. RRR అందించిన విజయంతో తెలుగు సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

కానీ తాజాగా “RRR: బిహైండ్ & బియాండ్” అనే డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దీనిపై నానా చర్చ జరుగుతోంది. RRR సినిమా విజయ గాధ, ఆ సినిమా వెనుక జరిగిన కష్టాలు, టీమ్ ఎఫర్ట్, ఇంటర్నేషనల్ ఫీట్‌లను ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేక్షకులు దీనిని ఓటీటీ లేదా యూట్యూబ్ వేదికగా చూసేందుకు అంగీకరిస్తారు కానీ థియేటర్లలో మాత్రం వీక్షించాలనే ఆసక్తి చూపుతారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇప్పటివరకు విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఈ డాక్యుమెంటరీని కేవలం ఇంగ్లీష్ భాషలోనే విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. తెలుగులోనూ, హిందీలోనూ విడుదల చేస్తారా? లేదా ఇంగ్లీష్ లో మాత్రమే కానిచ్చేస్తారా? అనే క్లారిటీ కూడా లేదు. RRR లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి వెనుక ఉన్న స్టోరీని తెలుగువారికి మాత్రమే కాదు, హిందీ ఆడియెన్స్‌కి కూడా చేరువ చేయాల్సిన అవసరం ఉంది. కానీ భాష పరిమితితో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులను థియేటర్లకు ఎంతవరకు రప్పిస్తుందనే డౌట్ మొదలైంది.

అలాగే థియేటర్లలో డాక్యుమెంటరీ వర్కౌట్ అవుతుందా ఇది నిజానికి OTT లేదా యూట్యూబ్‌లో విడుదల చేయాల్సిన కంటెంట్ అని చాలామంది భావిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సినిమా అనుభవం కోరుకుంటారు. అయితే డాక్యుమెంటరీ కేవలం క్లోజ్ బీహైండ్ ది సీన్స్ అని తెలిసినప్పుడు, టిక్కెట్లు కొని థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు ముందుకు రారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు. కానీ ఈ డాక్యుమెంటరీ వల్ల ఆయనకు థియేట్రికల్ పరంగా ఫస్ట్ ఫ్లాప్ ఎదురవుతుందా? అనే చర్చ నడుస్తోంది. అంతేకాదు, ఇది డాక్యుమెంటరీ అయినప్పటికీ, అంతర్జాతీయ స్ఫూర్తిని తీసుకురావాలన్నదే రాజమౌళి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ప్రేక్షకుల స్వభావాన్ని గమనిస్తే, ఈ ప్రయత్నం థియేటర్లలో అంతగా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

అయితే, రాజమౌళి బ్రాండ్ వల్ల ఈ డాక్యుమెంటరీకి కొంత ఆసక్తి మాత్రం ఉండొచ్చు. అయితే లాంగ్ రన్‌లో ఇది ఆశించిన స్థాయిలో వసూళ్లు అందుకుంటుందా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి, RRR లాంటి విజయం వెనుక ఉన్న ప్రయత్నాలను, గొప్ప కష్టాలను చూపించే ఈ డాక్యుమెంటరీ అందరినీ ఆకట్టుకోవాలని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ నెల 20న థియేటర్లలో విడుదలవుతున్న ఈ డాక్యుమెంటరీపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News