సచిన్ గెస్ట్ గా బయోపిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' టైటిల్ తో భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' టైటిల్ తో భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అక్టోబర్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవ్వబోతున్నాయి. రేపు అంటే 5వ తారీకు ముంబై లో '800' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లాంచనంగా జరుగబోతుంది.
ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో టీం ఇండియా మాజీ స్టార్ క్రికెటర్, క్రికెట్ దేవుడు అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొనబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా కి ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సచిన్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయితే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ముంబైలో జరుగబోతున్న ఈ ఈవెంట్ లో ఇంకా ఎంతో మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు క్రీడా రంగానికి చెందిన వారు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా లో ముత్తయ్య మురళీధరన్ యొక్క క్రీడా జీవితం తో పాటు అత్యంత ఆసక్తికరంగా రియల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ను కూడా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా లో మధుర్ మిట్టల్ మెయిల్ లీల్ లో కనిపించబోతున్నాడు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క్రికెట్ అభిమానులకు కచ్చితంగా వినోదాల విందు పంచడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియో లు చూసి ముత్తయ్య మురళీ ధరన్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
1992 నుండి 2011 వరకు ముత్తయ్య మురళీ ధరన్ తన ఆటతో క్రికెట్ అభిమానులను అలరించాడు. క్రికెట్ చరిత్ర లో ఎప్పటికి నిలిచి ఉండే ఘన కీర్తిని, ఘన చరిత్ర ను సృష్టించాడు. టెస్టుల్లో 800 వికెట్లను దక్కించుకున్న ఏకైక బౌలర్ గా నిలిచాడు. ముత్తయ్య క్రికెట్ కెరీర్ మరియు ఆయన వ్యక్తిగత జీవితం లో కూడా నాటకీయ పరిణామాలు చూపిస్తూ '800' సినిమా