పవన్ జెట్ స్పీడ్.. బ్రో పనైపోయింది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు విడుదల చేసిన బ్రో మూవీ టైటిల్, పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. విడుదలకు దగ్గరపడుతుండటంతో ఎడిటింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఇక అందరి డౌట్ మూవీ డబ్బింగ్ గురించే. ఎందుకంటే, మొన్నటి వరకు పవన్ తన వారాహి యాత్రలో ఉన్నారు. తాను ఆ యాత్రలో ఉండగానే బ్రో మూవీ టీజర్ విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన ఏపీలో తాడేపత్రిలో ఉండే తన కార్యాలయం నుంచే డబ్బింగ్ పూర్తి చేశారు.
కాగా, మూవీ విషయానికి వస్తే, ఆయన కేవలం ఒకే ఒక్క రోజులో డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్లు టాక్. దర్శకుడు సముద్రఖని పవన్ కి డబ్బింగ్ కోసం కేవలం ఒక్కరోజే సమయం ఇచ్చారట. ఆయన కూడా ఆ ఒక్క రోజులోనే మొత్తం పూర్తి చేసేశారట. మూవీ పూర్తి అవుట్ పుట్ చూసి చిత్ర బృందం చాలా సంతోషంగా ఉందట. అయితే, ఇక్కడే ఓ అనుమానం మొదలైంది. ఒక్కరోజులోనే డబ్బింగ్ అయిపోయింది అంటే, పవన్ నిడివి అంత తక్కువ ఉంటుందా అనే సందహాలు తలెత్తుతున్నాయి.
ఇక, పవన్ మూవీ మొదలవ్వగానే కనిపించరట. మూవీ మొదలైన 15 నిమిషాల తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుందట. మళ్లీ చివరలో 15 నిమిషాల పాటు కనిపించరట. చివరగా క్లైమాక్స్ లో దర్శనమిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే థియట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయగా, విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ క్యామియోలో నటించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 28 జూలై 2023న విడుదల కానుంది. తమిళంలో వచ్చిన వినోదమయ సీతం మూవీకి రీమేక్ గా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు.