మహేష్ బాబు గురించి సల్మాన్ ఖాన్ ఎందుకు ఆలా అన్నాడు ?
తెరపై అతడి (మహేష్ బాబు) నడక శైలి, యాక్షన్, లుక్స్ విషయంలో స్టైలిష్ వైఖరిని కలిగి ఉన్నాడు .
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆయన జీవితంలో అత్యుత్తమ ప్రశంస దక్కింది. అతడు నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అంటూ మహేష్ ని పొగిడేశారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. బిగ్ బాస్ 18 వేదికగా హోస్ట్ సల్మాన్ ఇంటి సభ్యురాలైన శిల్పా శిరోద్కర్ (మహేష్ భార్య నమ్రత సోదరి)తో మాటల సందర్భంలో మహేష్ గురించి మాట్లాడుతూ పాజిటివ్ నోట్ అందించాడు. ఒక స్టార్ హీరోగా మహేష్ ని.. నిజ జీవితంలో మహేష్ ని పోల్చి చూస్తే తనలో కనిపించిన లక్షణాల గురించి సల్మాన్ వివరించిన తీరు ఆశ్చర్యపరిచింది.
తెరపై అతడి (మహేష్ బాబు) నడక శైలి, యాక్షన్, లుక్స్ విషయంలో స్టైలిష్ వైఖరిని కలిగి ఉన్నాడు . కానీ నిజ జీవితంలో అతడు సాధారణ.. నిజమైన ఫ్యామిలీమ్యాన్! అని సల్మాన్ వ్యాఖ్యానించారు. సల్మాన్ ప్రశంస ఇప్పుడు ఘట్టమనేని అభిమానుల్లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ``సల్మాన్ మహేష్ బాబు సింప్లిసిటీని సల్మాన్ ప్రశంసించడం హృదయాలను టచ్ చేసిందని ఒక నెటిజన్ అన్నారు. మహేష్ స్టార్డమ్, వినయం అరుదైన మేళవింపు అని సల్మాన్ మాటలు రుజువు చేశాయని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
సల్మాన్ ఖాన్- షారూఖ్ ఖాన్- అమీర్ ఖాన్, అమితాబ్, అక్షయ్, రణవీర్, రణబీర్ వంటి స్టార్లు దక్షిణాది పరిశ్రమ స్టార్ల గురించి చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. మన ప్రతిభను వారు నిజాయితీగా ప్రశంసిస్తున్నారు. ఇక్కడి స్టార్లతో కలిసి పని చేయాలనుకుంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ మహేష్ నటించిన పోకిరి చిత్రాన్ని వాంటెడ్ పేరుతో హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టింది. మహేష్ తో అప్పటి నుంచే సల్మాన్ కి అనుబంధం ఉంది. అందువల్ల సల్మాన్ - మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో ఇది సాధ్యమేనని కూడా విశ్లేషిస్తున్నారు.