పెళ్లి ప్రపోజల్‌తో సమంతను ఒప్పించేసిన ఘనుడు!
ఈ మొత్తం వీడియో కోసం జిమ్‌లో కొన్ని అందమైన షాట్స్ ని చిత్రీకరించి స్ట్రీమ్ చేసాడు.
శోభితా ధూళిపాళతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే సమంత రూత్ ప్రభుకు పెళ్లి ప్రతిపాదన వచ్చింది. సమంత అభిమాని ఒకరు ఇన్‌స్టా వీడియోలో సూటిగా తనకు ప్రపోజ్ చేశాడు. 'ముఖేష్ చింత' అనే యువకుడు ఇన్‌స్టాలో ఒక ప్రపోజల్ వీడియోను షేర్ చేశాడు. అందులో అతడు హైదరాబాద్‌లోని సమంత ఇంటిని ట్రాక్ చేస్తున్నట్లు నటిస్తూ.. తనకు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించాడు. జిమ్ లో మోకాలిపైకి వంగి ప్రపోజ్ చేసాడు. ఈ మొత్తం వీడియో కోసం జిమ్‌లో కొన్ని అందమైన షాట్స్ ని చిత్రీకరించి స్ట్రీమ్ చేసాడు.
''ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడానికి నేను సమంత వద్దకు వెళుతున్నాను.. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఆమెకు అండగా ఉంటాను'' అని ముఖేష్ సరదాగా చెప్పడంతో వీడియో ప్రారంభమైంది. అతడు తన ఇంటికి చేరుకున్న తర్వాత చివరికి సామ్ ని 'జిమ్'లో ట్రాక్ చేసి వివాహం చేసుకోమని వేడుకున్నాడు. అంతేకాదు తనను పెళ్లి చేసుకునే ముందే సంపాదించడానికి రెండు సంవత్సరాల సమయం అడిగాడు. ఆ తర్వాత ఒక మోకాలిపైకి వంగి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ''మీరు తీసుకోని షాట్లలో 100 శాతం మిస్ అవుతున్నారు'' అని రాసాడు.
సమంత దీనికి స్పందిస్తూ..''నేపథ్యంలో ఉన్న జిమ్ నన్ను దాదాపుగా ఒప్పించింది'' అని రాసారు. తన ఇన్‌స్టా స్పందనను షేర్ చేసిన ముఖేష్ ''ప్రపంచం సమంతకు వ్యతిరేకంగా ఉంటే, నేను ప్రపంచానికి వ్యతిరేకిని'' అని రాశాడు. మొత్తానికి ఇదంతా చూసాక ముఖేష్ ప్రతిపాదన చాలా నిజాయితీగా ఉందని నెటిజనులు సమర్థిస్తున్నారు. అతడి నిజాయితీని ఒక యువతి ప్రశంసించింది. ''ఒక అమ్మాయిగా, నేను అతనిని భర్త మెటీరియల్‌గా అంగీకరిస్తున్నాను. నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి.. నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటాను! అని అతడు అన్నాడు. ఎందుకంటే అతను డబ్బు, అందం కోసం ఆమెను వివాహం చేసుకోవడంలేదు. అతడు చాలా సీరియస్‌గా ఉన్నాడు. మంచి ప్రేమ, సంబంధం కోసం వాగ్దానం చేయడం ద్వారా అతడు తన భార్యను సంతోషపెట్టడానికి కృషి చేస్తానని.. ఒక బిడ్డతో కుటుంబాన్ని నడిపించేంత పరిణతి చెందాడని ఈ వీడియో చూపిస్తోంది'' అని ఆ యువతి వ్యాఖ్యానించారు.
చైతన్య ఇప్పటికి హ్యాపీగా ఉన్నాడు:
సామ్ మాజీ భర్త నాగ చైతన్య త్వరలోనే శోభిత ధూళిపాలను పెళ్లాడబోతున్నాడు. ఇంతలోనే సమంతను అభిమానులు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఉత్సాహపరుస్తున్నారు. సమంత నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత చైతన్య డిప్రెషన్ లోకి వెళ్లానని అన్నాడు. కానీ ఇప్పుడు శోభిత తన జీవితంలో ప్రవేశించడంతో అతడు ఆనందంగా ఉన్నాడు.
ఈ విషయాన్ని నాగార్జున ఒక పాపులర్ మీడియాకు ధృవీకరించారు. ''చై మళ్లీ చాలా సంతోషంగా ఉన్నాడు. నేను కూడా! ఇది చైకి లేదా కుటుంబానికి అంత తేలికైన సమయం కాదు. సమంత నుంచి విడిపోవడం అతడిని చాలా డిప్రెషన్‌కు గురి చేసింది. మా అబ్బాయి తన భావాలను ఎవరికీ చూపించడు. కానీ అతడు సంతోషంగా లేడని నాకు తెలుసు. తనను మళ్లీ చిరునవ్వుతో చూడడానికి ఈ ప్రయత్నం. శోభిత - చై అద్భుతమైన జంట. వారు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకుంటున్నారు'' అని నాగార్జున టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.