వర్షాకాలం మెడిసిన్ ఎలా తీసుకోవాలో సామ్ టిప్స్
దినచర్య ఎలా ఉండాలి? ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా పాడ్ కాస్ట్ లో చర్చించారు.
మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటి నుండి పాన్-ఇండియన్ స్టార్ సమంత రూత్ ప్రభు ఆరోగ్యం విషయంలో మరింత స్పృహను కలిగి ఉన్నారు. అనవసరమైన మందులకు బదులుగా సమంత ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తున్నారు. తన టేక్ 20 పాడ్‌క్యాస్ట్‌లలో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, సమతుల్య జీవితం ప్రాముఖ్యత గురించి ప్రస్థావించారు. దినచర్య ఎలా ఉండాలి? ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా పాడ్ కాస్ట్ లో చర్చించారు.
అయితే ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని సమంత ప్రతిపాదిస్తున్నారు. అనవసరమైన మందులపై పై చేయి సాధించే సహజ పద్ధతుల కోసం తనదైన శైలిలో వాదన వినిపిస్తున్నారు సమంత. తన ఇన్‌స్టాలో ఫేస్ మాస్క్‌తో నెబ్యులైజర్ మెషీన్‌ను ఉపయోగిస్తున్న ఒక ఫోటోని సామ్ షేర్ చేసింది.
సాధారణ వైరల్ రుగ్మతలకు ఔషధం తీసుకునే ముందు, ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించండి! అని సమంత వర్షాకాలం మెడిసిన్ ని ఎలా తీసుకోవాలో వెల్లడించారు. రుతుపవనాల రాకతో జలుబు, జ్వరాలు సాధారణంగా వస్తుంటాయి గనుక వాటిని దృష్టిలో ఉంచుకుని హెల్త్ చిట్కాను సూచించింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ -డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో నెబ్యులైజ్ చేయడం ఒక ఎంపిక అని సమంత రాశారు.
''ఇది పనిచేస్తుందని హామీ ఉంది. మేజిక్ లాగా పనిచేస్తుంది. (ఒక క్యాప్సూల్ ఎమోటికాన్) #ప్రత్యామ్నాయ ఔషధం అనవసరమైన మందులను తగ్గించేందుకు..'' అని సమంత తెలియజేసింది.
ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు సమంత గతంలో తన ఆహారం, మార్షల్ ఆర్ట్స్, వెయిట్ ట్రైనింగ్ సహా రకరకాల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లలో తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి సోషల్ మీడియాలో తన ప్రయత్నాల గురించి షేర్ చేసారు. ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లలో సామ్ చాలా వీడియోలలో సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. ఆరోగ్యం పరంగా లక్ష్యాలపై తనకున్న అభిరుచిని స్పష్టంగా ప్రదర్శిస్తుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... సిటాడెల్ - హనీ బన్నీ సిరీస్ ఇంకా ఓటీటీలో రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇంతలోనే సమంత మరోసారి వెబ్ సిరీస్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. రాజ్ & DK దర్శకత్వం వహించనున్న తాజా వెబ్ సిరీస్ టైటిల్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'రక్తబీజ్' పేరుతో భారీ యాక్షన్ డ్రామాను వారు తెరకెక్కించనున్నారని, ఇందులో సమంత స్టంట్స్ చేస్తుందని చెబుతున్నారు. ఆసక్తికరంగా ఈ వెబ్ సిరీస్ తో ఆదిత్య రాయ్ కపూర్ ఓటీటీ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు.
ది నైట్ మేనేజర్ తో విజయం అందుకున్న ఆదిత్య గత ఆరు నెలలుగా రాజ్ అండ్ డీకేతో చర్చలు జరుపుతున్నాడు. తొలి వెబ్ సిరీస్ విజయం తర్వాత గత మేలో కొత్త ప్రాజెక్ట్‌కు తన ఆమోదం తెలిపాడు. ఇక సమంత- ఆదిత్యరాయ్ కలయికలో ఈ వెబ్ సిరీస్ రక్తి కట్టిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే 'రక్తబీజ్' చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ యాక్షన్-ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి సమంత, ఆదిత్య ఇద్దరూ తమ తమ పాత్రల కోసం సిద్ధమవుతున్నారు. రాజ్ & డికె 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' పనిని ముగించిన వెంటనే, ఆగస్ట్‌లో ఈ కొత్త సిరీస్ చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారు. 'సిటాడెల్: హనీ బన్నీ'లో వరుణ్ ధావన్ సరసన నటించిన సమంత ఇప్పుడు ఆదిత్యారాయ్ తో కలిసి నటించనుండడం ఆసక్తిగా మారింది. వరుసగా బాలీవుడ్ యువహీరోల సరసన సమంత అవకాశాలు అందుకుంటోంది.