నా దారి నాదే అంటున్న సామ్!

స్టార్ హీరోయిన్ సమంత.. కొన్నేళ్ల క్రితం మయోసైటిస్ బారిన పడ్డ విషయం తెలిసిందే.

Update: 2024-08-21 10:31 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. కొన్నేళ్ల క్రితం మయోసైటిస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. యశోద మూవీ టైమ్ లో తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్టు ప్రకటించిన సామ్.. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంది. కాస్త గ్యాప్ తర్వాత అప్పటికే తన చేతిలో ఉన్న విజయ్ దేవరకొండ ఖుషీ మూవీతో పాటు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ను కంప్లీట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన నటించిన ఆమె.. వెబ్ సిరీస్ షూటింగ్ లో ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడింది.

ఆ తర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లిన సామ్.. అక్కడ ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలింది. కొండలు కోనలు తిరిగి ప్రకృతిని ఆస్వాదించింది. కొన్ని రోజుల క్రితం ఇండియా వచ్చిన అమ్మడు... మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే సిటాడెల్ సిరీస్ తో సందడి చేయనుండగా.. తన సొంత బ్యానర్ పై మూవీ ప్రకటించింది. మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమె రెండో పెళ్లి గురించి కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.

నాగచైతన్య, సమంత కొన్నేళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం.. చై రీసెంట్ గా హీరోయిన్ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం.. ఇవన్నీ తెలిసిందే. అదే సమయంలో సామ్ రెండో పెళ్లిపై కూడా వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ తో సామ్ ప్రేమలో ఉందని టాక్ వినిపించింది. ఆ సిరీస్ సెకండ్ సీజన్ లో ఆమె నటించింది. అప్పటి నుంచి వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే సమంత కానీ, రాజ్ కానీ రూమర్లపై రియాక్ట్ కాకపోవడం.. ప్రేమ విషయం నిజమేనని కొందరు అంటున్నారు. అదే సమయంలో సామ్ నిన్న పెట్టిన ఇన్ స్టా పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సమ్ థింగ్ స్పెషల్ రాబోతోంది.. స్టే ట్యూన్డ్ అంటూ ఆమె పోస్ట్ పెట్టడంతో నెట్టింట జోరుగా చర్చ సాగింది. రాజ్ తో ఎంగేజ్మెంట్ డేట్ ను అనౌన్స్ చేస్తుందని చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఫ్యాన్స్ మాత్రం.. మూవీ అప్డేట్ అయ్యి ఉంటుందని అంచనా వేశారు.

కానీ.. ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్ ప్రెస్ మీట్ లో మెరిసింది సమంత. మెగా టోర్నీలో భాగంగా చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు చెప్పింది. చెన్నై ఫ్రాంచైజీ ఓనర్ కావడం సంతోషంగా ఉందని తెలిపింది. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పోస్ట్ పెడుతుందని అంతా అనుకోగా.. అందుకు బదులు తన కొత్త బిజినెస్ వెంచర్ ను అనౌన్స్ చేసింది. రూమర్స్ వైపు మళ్లీ కన్నెత్తి కూడా చూడలేదు! బిజినెస్ లో తన స్కిల్స్ చూపించేందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు ఇన్ డైరెక్ట్ గా ప్రకటించింది. మొత్తానికి రెండో పెళ్లిపై రూమర్స్ వస్తున్నా.. నా దారి నాదే అన్నట్లు ముందుకెళ్తోంది సామ్!!

Tags:    

Similar News