బ్రేక్ ఇచ్చినా సూపర్ స్టార్స్ వదలడం లేదు!
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో గతంలోనే సమంత నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు విజయ్ 69 సినిమాలో కూడా నటించబోతుంది.
సమంత సినిమా ఇండస్ట్రీలో 'ఏమాయ చేశావే' తో అడుగు పెట్టి 14 ఏళ్లు దాటింది. ఇప్పటికి కూడా స్టార్ ఆఫ్ ది ఇండస్ట్రీగానే సమంత కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. సాధారణంగా ఎవరైనా హీరో లేదా ఇతర నటులు కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటే ఫిల్మ్ మేకర్స్ వారిని మరచి పోయే అవకాశం ఉంది.
సమంత మయోసైటిస్ కారణంగా ఏకంగా ఏడాదికి పైగా బ్రేక్ తీసుకుంది. సినిమాలు చేయకుండా పూర్తిగా రెస్ట్ మూడ్ లో ఉన్న సమంత ఇటీవలే షూటింగ్స్ కి తిరిగి హాజరు అవుతోంది. ఇప్పటికే ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన సమంత తాజాగా సూపర్ స్టార్ విజయ్ మూవీ లో నటించేందుకు ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో గతంలోనే సమంత నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు విజయ్ 69 సినిమాలో కూడా నటించబోతుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ పూర్తి అయిన వెంటనే హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ మూవీ చేయబోతున్నాడు.
విజయ్ రాజకీయ ప్రకటన చేసిన నేపథ్యంలో హెచ్ వినోద్ సినిమా చివరి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే విజయ్ చివరి సినిమాలో నటించిన అరుదైన ఘనత సమంత దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సమంత ఏడాది బ్రేక్ తీసుకున్నా కూడా ఏమాత్రం జోరు తగ్గలేదు. ఆమె ఓకే అనాలే కానీ ఏకంగా ఆమె కిట్టీ లో అర డజను సినిమాలు నిండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆమె మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది.
సూపర్ స్టార్ సినిమాలతో పాటు, మంచి కథలను ఎంపిక చేసుకుని మరీ సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గా సమంత ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలు చేసి ఆకట్టుకుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలతో పాటు విభిన్నమైన ఓ బేబీ, యశోద వంటి సినిమాలు చేసింది. ఇప్పుడు మరోసారి తమిళ్ సూపర్ స్టార్ కి జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.