ఆ వెతుకులాట..ఎదురు చూపు ఎవరి కోసమో!
బాలీవుడ్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా సెన్షేషన్ తెలిసిందే. ఎలాంటి డిజైనర్ లో నైనా శామా సెగలు పుట్టించాల్సిందే.;
బాలీవుడ్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా సెన్షేషన్ తెలిసిందే. ఎలాంటి డిజైనర్ లో నైనా శామా సెగలు పుట్టించాల్సిందే. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరి అంటుంది. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో కిక్కు ఏమాత్తం తగ్గదు. డిజైనర్ దుస్తులేసినా..చీర కట్టినా షామా అందాలకి తిరుగుండదు. మిగతా భామల నుంచి పోటీ తట్టుకునేందుకు అందుకు తగ్గట్టే మౌల్డ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆ వేడి మరింత రెట్టింపు చేసినట్లు కనిపిస్తుంది.
తాజాగా అమ్మడు ఖాతా లో మరో కొత్త భంగిమ చూపరులను ఆకర్షిస్తుంది. ఇదిగో ఇక్కడిలా వంగపువ్వు రంగు ఔట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తోంది. అమ్మడు అందాలన్నిఆవిష్కరించిన నవ్య భంగిమకి కుర్రకారంతా ఫిదా అవ్వాల్సిందే. నడ్డి వంచి ఎవరి కోసం వెతుకులాట..ఎదురు చూపులు చూస్తోంది. ఈ భంగిమ షామాని మరింత వైవిథ్యంగా హైలైట్ చేస్తోంది. షామా అలా చేయెత్తి చూస్తుంటే? ఆ ఎదురు చూపు నా కోసమేనా అనిపించక మానపదు.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని ఉద్దేశించి షామా ఇలా రాసుకొచ్చింది. `నేను ఎవరిని వెతుకుతున్నానో ఇప్పుడైనా ఆలోచిస్తున్నారా? మిస్టరీని వెలికితీసేందుకు రేపటి రీల్ కోసం వేచి ఉండండి అంటూ పోస్ట్ చేసింది. అంటే దీనికి కొనసాగింపుగా ఇదే సిరీస్ నుంచి అమ్మడు మరికొన్ని వైవిథ్యమైన భంగమల్ని వదలబోతుంది? అన్న విషయం అర్దమవుతుంది.
నటవృత్తి పరంగా శామ్ ఇంకా వెనుకబడే ఉంది. `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ అప్పీరియన్స్ తప్ప ఇంత వరకూ కొత్త ఛాన్స్ అందుకుంది లేదు. మరి తాజా ప్రయత్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడతాయా? అన్నది చూడాలి.