అర్జున్ రెడ్డి సాయి పల్లవితో చేయాల్సింది: సందీప్ రెడ్డి వంగా
అందుకే కేరళ నుంచి సాయి పల్లవి కో ఆర్డినేటర్ గా చెప్పుకునే ఓ వ్యక్తి కాంటాక్ట్ సంపాదించి మరీ ఆయన్ని సంప్రదించినట్టు తెలిపాడు.
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాన్ని షేర్ చేసుకుని అందరికీ షాకిచ్చాడు. తన ఫస్ట్ ఫిల్మ్ అర్జున్ రెడ్డి కోసం హీరోయిన్ కు వెతికే టైమ్ లో ప్రేమమ్ చూసిన అతని మనసులో సాయి పల్లవి ఉండిపోయిందని, అందుకే కేరళ నుంచి సాయి పల్లవి కో ఆర్డినేటర్ గా చెప్పుకునే ఓ వ్యక్తి కాంటాక్ట్ సంపాదించి మరీ ఆయన్ని సంప్రదించినట్టు తెలిపాడు.
తన సినిమా ఓ లవ్ స్టోరీ అని చెప్పగానే ఆ కోర్డినేటర్ అలా అయితే మీరు కరెక్ట్ పర్సన్ కోసమే వెతుకుతున్నారని చెప్పాడని, కానీ తన సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పడంతో అయితే సాయి పల్లవి గురించి మర్చిపొమ్మని, తను స్లీవ్‌లెస్ కూడా వేసుకోదని ఆయన చెప్పాడని తెలిపాడు. ఆ విషయం తెలుసుకున్న సందీప్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరైనా ఇంతే ఉంటారులే అనుకున్నానని చెప్పాడు.
కానీ సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్నా ఆమె మాత్రం తన కట్టుబాట్లను ఎప్పుడూ మర్చిపోకుండా మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందని, అదే తనను ఆమెకు ఫ్యాన్ గా మార్చిందని సందీప్ వంగా వెల్లడించాడు. తర్వాత సాయి పల్లవి తన స్పీచ్‌లో సందీప్ మాటలకు స్పందించింది.
మొదటి సినిమా నుంచి యానిమల్ వరకు ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ గా సందీప్ ఎదిగిన వైనాన్ని మెచ్చుకున్న సాయి పల్లవి, తనకు మేనేజర్ లాంటి వాళ్లు ఎవరూ లేరని, మీరెవరితో మాట్లాడారో తనకు తెలియదని, ఎవరెన్ని అనుకున్నా ఒక సినిమా ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లే చేస్తారని, అర్జున్ రెడ్డి సినిమాలో షాలినీ, విజయ్ అద్భుతంగా నటించారని తెలిపింది.
ఈ సందర్భంగా మీరు ఆ స్వీట్ మెమొరీని షేర్ చేసుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ అంటూ సాయి పల్లవి, సందీప్ కు థ్యాంక్స్ చెప్పింది. మొత్తానికి ఈ ఈవెంట్ లో సందీప్ రెడ్డి సాయి పల్లవి గురించి మాట్లాడిన మాటలైతే అందరినీ ఆశ్చర్యపరిచాయి. నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.