2025లో మొదటి హిట్టు.. వెంకీ లిస్టులో మరో బ్లాక్ బస్టర్ బొమ్మ!

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.

Update: 2025-01-17 06:45 GMT

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఇక సంక్రాంతి సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకుంటూ, ఈ సినిమా మూడు రోజులకే భారీ వసూళ్లు నమోదు చేసింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.


మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ స్థాయిలో బుకింగ్స్ నమోడవ్వడం విశేషం. మూడో రోజుకు టోటల్ గా 29 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, వెంకటేశ్ సినిమాలలోనే వేగవంతమైన 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. బుక్‌మైషోలో 1.5 మిలియన్ టికెట్లు అమ్ముడవడం ఈ చిత్రానికి ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.

ఓవర్సీస్ లో కూడా "సంక్రాంతికి వస్తున్నాం" ఒక రికార్డ్ ను చేరుకుంది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న వెంకటేశ్ చిత్రంగా కూడా ఇది రికార్డు సృష్టించింది. ఇది వెంకటేశ్‌కి నాలుగో 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమా కావడం విశేషం. గత సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా అందుకున్న వసూళ్లు ఆయన స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసింది. అన్ని ప్రాంతాల్లో నిర్మాతలకు లాభాలను అందిస్తోంది. ఈ చిత్రానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మరిన్ని థియేటర్లను అదనంగా యాడ్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో "మార్కో" అనే మలయాళం డబ్బింగ్ చిత్రం జనవరి 1న విడుదలై తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన తొలి చిత్రం కాగా, "సంక్రాంతికి వస్తున్నాం" ఆ తర్వాతి సినిమా.

తెలుగులో చూస్తే ఇదే ఈ ఏడాది మొదటి హిట్. ఏదేమైనా ఈ రెండు చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది హిట్ పరంపరకు శుభారంభం చేశాయి. "సంక్రాంతికి వస్తున్నాం" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, పూర్తి రన్‌లో 200 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాతో వెంకటేశ్ కెరీర్‌లో మరొక మెగా హిట్‌ను నమోదు చేసుకున్నారు.

Tags:    

Similar News