గుంటూరు కారం కోసం చెప్పవే చిరుగాలి..!

గుంటూరు కారం సినిమాతో సూపర్‌ హిట్ కొట్టేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Update: 2023-12-29 12:54 GMT

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు మరియు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు రాబోతున్నా కూడా ఎక్కువ శాతం మంది ఛాయిస్ గుంటూరు కారం అయ్యి ఉంటుంది అంటూ సూపర్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.

గుంటూరు కారం సినిమాతో సూపర్‌ హిట్ కొట్టేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి అయ్యి ఎప్పుడో రావాల్సిన ఉన్నా కూడా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా రాబోతున్న గుంటూరు కారం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాగా ఎదురు చూస్తున్నారు.

ఇక గుంటూరు కారం సినిమా గురించిన విషయాలు, విశేషాలు అంచనాలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా మహేష్ బాబు సూపర్‌ హిట్ మూవీ ఒక్కడు లోని చెప్పవే చిరుగాలి పాట బిట్‌ ను గుంటూరు కారంలో పెట్టినట్టు సమాచారం అందుతోంది. ఆ పాట వచ్చినప్పుడు కచ్చితంగా మహేష్ ఫ్యాన్స్‌ కేకలు వేయడం ఖాయంగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో ఆ పాట రావడం ద్వారా సినిమా ను మరింత హై కి దర్శకుడు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం ను తీసుకున్నాడు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తానికి గుంటూరు కారంలో ఒక్కడు రిఫరెన్స్ ఉండబోతుంది అనే ప్రచారం అంచనాలను మరింత పెంచుతుంది.

శ్రీలీల హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా మీనాక్షి చౌదరి కనిపించబోతుంది. థమన్‌ అందించిన సంగీతం ఇప్పటికే మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ను ఉర్రూతలూగిస్తూ ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత పాటలు మరింత పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News