అల్లు అర్జున్, చరణ్ ఈ డ్యాన్సులు ఆపేయాలి: షారూఖ్
ఇప్పుడు దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు వారి అభిమానులను ఉత్సాహపరిచాయి.
డ్యాన్సుల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ ప్రభావం ఎలా ఉంటుందో ఎప్పుడూ పెద్ద చర్చ. ఇప్పుడు దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు వారి అభిమానులను ఉత్సాహపరిచాయి. ఈ ఈవెంట్ నుంచి ఒక వైరల్ క్లిప్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ మాట్లాడుతూ... అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, విజయ్, యష్, రజనీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు దక్షిణాది స్టార్లను తన స్నేహితులు అని వ్యాఖ్యానించారు.
షారుఖ్ ఖాన్ నవ్వుతూ ఉత్సాహంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో అది స్టార్ల అభిమానులను ఆకర్షించింది. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అభిమానులను ఉద్దేశించి ఖాన్ ఆప్యాయంగా మాట్లాడారు. నాకు దక్షిణ భారతదేశం నుండి చాలా మంది స్నేహితులు ఉన్నారు అని ఆయన అన్నారు. అలాగే రజనీ సర్, కమల్ సర్ అంటూ తన సీనియర్లను ఎంతో గౌరవమర్యాదలతో వ్యాఖ్యానించారు.
నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీరు చాలా వేగంగా డ్యాన్స్ చేయడం మానేయాలి. మీతో పాటు డ్యాన్సులు చేయడం నాకు కష్టం.. అని దక్షిణాది స్టార్లను ఉద్ధేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ స్టార్లపై ఆయన తన అభిమానం ప్రేమను కురిపించడం వారి ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తోంది. కింగ్ ఖాన్ షారూఖ్ సినిమాలపై మహేష్, అల్లు అర్జున్, చరణ్ లాంటి స్టార్లు ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై స్పందిస్తున్నారు. షారూఖ్ పై తమ అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. వారికి షారూఖ్ తిరిగి రిప్లయ్ కూడా ఇచ్చారు. అలా వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. చరణ్, బన్ని వంటి స్టార్ల డ్యాన్సులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ని, గుర్తింపును కూడా ఖాన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నాయి.