షారుఖాన్ త‌మిళ వాస‌న ఎంత క‌మ్మ‌గా ఉందంటే!

షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ నేతృత్వంలో `జ‌వాన్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2023-08-31 11:25 GMT

షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ నేతృత్వంలో `జ‌వాన్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార‌.. ప్రియ‌మ‌ణి..విజ‌య్ సేతుప‌తి లాంటి తారలు జ‌వాన్ కీల‌క భాగ‌స్వాములు. యువ సంచ‌ల‌నం అనిరుద్ సంగీతం అందించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా చెన్నైలో భారీ ఎత్తున ఆడియో వేడుక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా షారుక్ ఖాన్ కి కోలీవుడ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాట‌లు మొద‌లు నుంచి ముగింపు వ‌ర‌కూ త‌మిళ వాస‌న కొట్టొచ్చిన‌ట్లే ఉంది. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

`చెన్నై లో ఈవెంట్ అంటే గుర్తుండిపోయేలా చేయాల‌ని అట్లీ అన్నాడు. ఇంత పెద్ద ఈవెంట్ లో ఎప్పుడూ పాల్గొన‌లేదు. ఇదెప్ప‌టికీ మ‌ర్చిపోలేను. త‌మిళ ప‌రిశ్ర‌మ న‌న్ను ఆహ్వానించిందుకు ధ‌న్య‌వాదాలు. ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు నా వేడుక‌కు రావ‌డం చాలా సంతోషంగా ఉంది( ఏమోష‌న‌ల్ గా). ఇక్క‌డ నాకు స్నేహితులు ఇద్ద‌రే. ఒక‌రు మ‌ణిర‌త్నం..రెండు సంతోష్ శివ‌న్. మణిరత్నంతో `దిల్ సే` సినిమాకు పనిచేశాను.

అది నా తొలి తమిళ చిత్రం. ఆ సమయంలో ఆ చిత్రంలో ఛయ్యా ఛయ్యా పాటకు డ్యాన్స్ చేశాను. అటుపై క‌మ‌ల్ హాస‌న్ తో `హే రామ్` సినిమా చేసాను. ఆ సినిమాతో త‌మిళ్ మాట్లాడాను. త‌మిళ్ మాట్లాడ‌టం అదే తొలిసారి. అలాగే మ‌రో మంచి స్నేహితుడు ర‌జ‌నీకాంత్. `రావ‌న్` లో ఓ సీన్ లో న‌టించ‌డానికి ఒప్పుకున్నారు. అలా ఏర్ప‌డిన స్నేహితుల‌తో మంచి అనుబంధం ఉంది.

ఇక విజ‌య్ సేతుప‌తి నాపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌చ్చు కానీ అమ్మాయిల నుంచి న‌న్ను సేతుప‌తి వేరు చేయ‌లేడు. ఎందుకంటే నా సిగ్నెచ‌ర్ ఎప్పుడో ప‌డిపోయింది. ఇక అనిరుద్ కి కొన్ని పాట‌లు ఇద్ద‌మ‌ని అట్లీ అంటే నేను మొత్తం పాట‌లు త‌న‌కే ఇద్దాం అన్నాను. అన్ని పాట‌ల‌కు మంచి సంగీతం అందించాడు. అనిరుద్ నా కొడుకు లాంటి వాడు. అత‌డిని చిన్న నాటి నుంచి చూస్తున్నా` అని అన్నారు.

Tags:    

Similar News