బోల్డ్ అవతారంతో కవ్విస్తున్న రియాలిటీ బ్యూటీ
రియాలిటీ షోలతో మంచి పేరు తెచ్చుకుంది షామా శికందర్. `యే మేరీ లైఫ్ హై` ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిన సంగతి తెలిసిందే.;
రియాలిటీ షోలతో మంచి పేరు తెచ్చుకుంది షామా శికందర్. `యే మేరీ లైఫ్ హై` ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెర, వెండితెర రంగంలో కెరీర్ సాగిస్తున్న ఈ బ్యూటీ విదేశీ ప్రియుడు జేమ్స్ మిల్లిరోన్ తో రొమాంటిక్ డేట్ లో ఉన్న సంగతి తెలిసిందే. షామా నిరంతర ఫోటోషూట్లు, వీడియో షూట్లతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ బోల్డ్ ఫోటోషూట్లకు విపరీతమైన స్పందన వస్తోంది.
ఇటీవల వరస ఫోటోషూట్‌లతో అగ్గి రాజేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరో బోల్డ్ ఫోటోషూట్ ని షేర్ చేయగా అది ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. భర్త మిల్లిరాన్ తో కలిసి ఓ ఫ్యాషన్ ఈవెంట్ కి అటెండయిన షామా ఈ స్పెషల్ యూనిక్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. గుర్తుంచుకోవాల్సిన సాయంత్రం! అంటూ షామా ఈ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో షామా డస్కీ అవతార్, రివీలింగ్ ఔట్ ఫిట్స్ తో మరోసారి మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని యువతరం వైరల్ గా షేర్ చేస్తున్నారు.
షామా ఈ కొత్త లుక్ లో ఎంతో గ్లామరస్ గా ఉందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఫోటోషూట్ లో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను నెటిజనులు షేర్ చేస్తున్నారు. రియాలిటీ క్వీన్ షామా జేమ్స్ మిల్లిరాన్ కి సరిజోడు అని కూడా కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. విదేశీతో షామా రొమాన్స్ అద్భుతంగా కుదిరిందన్న ప్రశంసలు కురుస్తున్నాయి.