బికినీ ట్రీట్ లో శ్రేయా క్యూట్ స్మైల్
"వాటర్ బేబీ" అని క్యాప్షన్ ఇచ్చి పలు ఫోటోలను షేర్ చేసిన ఆమె, ఫ్యాన్స్ నుంచి విశేష స్పందనను అందుకుంది.
టాలీవుడ్ లో చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన శ్రేయా ధన్వంతరి ఇప్పుడు బాలీవుడ్ డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా హవాయ్ లోని వైమనలో బీచ్ లో గడిపిన తన తాజా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంటూ మరోసారి నెటిజన్లను కట్టిపడేసింది. సముద్ర అలలతో ఆడుకుంటూ అందంగా సగరతీర సుందరిగా కనిపించిన శ్రేయా, కలర్ ఫుల్ బికినీలో తన ఫిట్‌నెస్ ను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచింది.
ఈ ఫోటోల్లో ఆమె ట్రెండీ లుక్ కు తోడు ఆమె స్మైల్ కూడా అదనపు ఆకర్షణగా మారింది. "వాటర్ బేబీ" అని క్యాప్షన్ ఇచ్చి పలు ఫోటోలను షేర్ చేసిన ఆమె, ఫ్యాన్స్ నుంచి విశేష స్పందనను అందుకుంది. ట్రెండీ బికినీ లుక్ తో స్టన్నింగ్ గా మెరిసిన శ్రేయా, హవాయ్ సముద్ర తీరంలో తన మైదానాన్ని చూపించింది. సహజ సౌందర్యానికి పర్యావరణం కలిసివచ్చినట్లు ఆమె పిక్స్ చూస్తే అర్థమవుతోంది. ట్రెండీ డ్రెస్సింగ్ కి స్టైలిష్ పర్సనాలిటీ ని జోడించి ఫోటోలలో తన సొగసును కుర్రాళ్లకు ఆహ్లాదం చేస్తోంది.
కెరీర్ విషయానికి వస్తే, శ్రేయా మొదట టాలీవుడ్ లో జోష్ వంటి చిత్రాలతో ప్రారంభించింది. తర్వాత ‘‘స్నేహగీతం’’ చిత్రంలో నటించి ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ చిత్రాలతో ఆశించిన గుర్తింపు రాకపోవడంతో ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడ ఆమె "వై చీట్ ఇండియా" వంటి సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక వెబ్ సిరీస్ లో అయితే ఆమె తన కంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకుంది. ‘‘ది ఫ్యామిలీ మాన్’’ ‘‘స్కామ్ 1992’’ వంటి హిట్ ప్రాజెక్టులతో మరింత గుర్తింపు పొందిన శ్రేయా, నటనతో పాటు గ్లామర్ షోలోనూ తనదైన ముద్ర వేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే శ్రేయా, తరచుగా తన ఫోటోషూట్ లతో అభిమానులను అలరిస్తుంది. ఇటీవల బీచ్ లో ఫోటోలు షేర్ చేసి నెటిజన్ల మనసును దోచుకున్న ఈ సుందరి, ఫిట్‌నెస్ మరియు ఫ్యాషన్ కు సమపాళ్ళలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. ట్యాటూ డిజైన్ ను హైలైట్ చేస్తూ, తక్కువ డ్రెస్సింగ్ తోనూ ఆకర్షణీయంగా కనిపించగల అందం ఆమె సొంతం. ప్రస్తుతం శ్రేయా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టి బిజీగా ఉంది.