శృతి నారాయణన్ స్పందన.. జీవితం నాశనం చేస్తున్నారని ఆవేదన!
ప్రైవేట్ వీడియోల పేరుతో కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;

కోలీవుడ్ నటి శృతి నారాయణన్ ప్రైవేట్ వీడియో లీక్ అయ్యిందంటూ కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ వీడియోల పేరుతో కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శృతి వీడియో లీక్ అంటూ నెట్టింట హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ విషయంపై శృతి స్పందించింది.

ఇన్ స్టాగ్రామ్ లో రెస్పాండ్ అయిన శృతి నారాయణన్.. వరుసగా పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా స్పందించిన ఆమె.. భావోద్వేగానికి గురైంది. తనకు చాలా క్లిష్టమైన సమయమంటూ ఆవేదన వ్యక్తం చేసిన శృతి.. ప్రస్తుత పరిస్థితి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదని వాపోయింది.
"గయ్స్.. నా మీద కంటెంట్ స్ప్రెడ్ చేస్తున్నవారికి చెబుతున్నా.. అది జోక్ కాదు.. ఫన్ కంటెంట్ కాదు.. నాతోపాటు నా ఆత్మీయులకు కఠినమైన సమయం. హ్యాండిల్ చేయడానికి కష్టంగా ఉంది. నేను ఒక అమ్మాయిని.. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. నా ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ఫీలింగ్స్ ఉంటాయి" అంటూ రాసుకొచ్చింది శృతి.
"ప్రతి దాన్ని వైరల్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా.. అదే సమయంలో మీ అమ్మ, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ చూడండి.. వాళ్లు కూడా అమ్మాయిలే.. నాలాగే వాళ్లకు కూడా సేమ్ శరీరాలే ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఒక మనిషి జీవితం.. మీ ఎంటర్టైన్మెంట్ కానే కాదు" అని శృతి నారాయణన్ తెలిపింది.
"బాధితురాలిని తిడుతూ పెట్టిన చాలా కామెంట్స్, పోస్టులు చూశాను. కానీ ఒకటి అడుగుతున్నా? ప్రతీ సారి మహిళలను ఎందుకు తప్పుబడుతున్నారు? ఎవరు లీక్ చేశారో వాళ్లను మాత్రం అడగరెందుకు? ప్రజలు స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. అందరి ఆడవాళ్లకు ఒకే శరీరం, సేమ్ శరీర భాగాలు ఉంటాయి" అని పోస్ట్ పెట్టింది.
అది వీడియో మాత్రమే కాదని, ఓ వ్యక్తి మానసిక ప్రశాంతతతోపాటు జీవితమని తెలిపింది శృతి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వీడియోస్ జీవితాలను నాశనం చేస్తున్నాయని, వాటిని ఎంకరేజ్ చేస్తూ సమస్యలో కొందరు భాగమవుతున్నారని వాపోయింది. అందుకే వీడియోలు షేర్ చేయొద్దని కోరింది.
"మనిషులుగా మారండి అంతా.. లీక్ వీడియోలు షేర్ చేయొద్దు.. వీడియోలు నిజమైనవి అయినా, డీప్ ఫేక్ వీడియోలు అయినా.. అలా చేసే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయి" అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత చట్టాల వివరాలు షేర్ చేసింది. ప్రస్తుతం శృతి నారాయణన్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి.