ప్రేమ - షుగర్ క్యాండీ ఆరోగ్యానికి హానికరం
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను నటుడిగా స్క్రీన్ పై చూపిస్తూ హీరోయిన్ శృతి హాసన్ రూపొందించిన మ్యూజిక్ ఆల్బం ఇనిమెల్.
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను నటుడిగా స్క్రీన్ పై చూపిస్తూ హీరోయిన్ శృతి హాసన్ రూపొందించిన మ్యూజిక్ ఆల్బం ఇనిమెల్. ఈ మ్యూజిక్ ఆల్బం కు కమల్ హాసన్ సాహిత్యంను అందించడంతో పాటు స్వయంగా నిర్మించిన నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.
లోకేష్ కనగరాజ్ ను నటుడిగా చూపించిన కారణంగా అందరి దృష్టి ఈ మ్యూజిక్ ఆల్బం పై పడింది. తాజాగా ఈ నాలుగు నిమిషాల వీడియో ఆల్బం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా శృతి హాసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.
ఈ పాటలో.. ప్రేమంటే ఒక మాయ, అదొక గందరగోళం లాంటి పరిస్థితి. జీవితంలో గాఢంగా ప్రేమించిన వ్యక్తితో ఉన్న అనుబంధం, జీవితం, ప్రేమలో విఫలం... వీటన్నింటిని కేవలం నాలుగు నిమిషాల వీడియో లో చూపించాం. ప్రస్తుత జనరేషన్ కి వారి మనస్థత్వంకు తగ్గట్లుగా ఈ పాట ఉంటుంది.
నా ఉద్దేశ్యంలో ప్రేమ అనేది ఒక మాయ. పంచదారతో చేసిన షుగర్ క్యాండీ ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా తినకుండా ఉండలేం. ప్రేమ కూడా అంతే. అది ఒక మాయ, చాలా ప్రమాదం అని తెలిసి కూడా ప్రేమలో పడకుండా ఉండలేమని శృతి చెప్పుకొచ్చింది.
లోకేష్ చాలా పెద్ద దర్శకుడు అయినా కూడా చాలా అణుకువగా ఉండే వ్యక్తి. ఆయన సెట్ లో చాలా సింపుల్ గా నడుచుకునే వారు. కాన్సెప్ట్ నచ్చి ఈ మ్యూజిక్ వీడియో లో నటించేందుకు ఒప్పుకున్నారు. నాన్న ఈ పాట కోసం లిరిక్స్ ను అందించాను. ఆయన పది రకాల లిరిక్స్ ను నాకు ఇచ్చారు.
విదేశీ కళాకారులతో వర్క్ చేయడం ను చాలా ఎంజాయ్ చేశాను. గొప్ప టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకుంటాం. అందుకే నేను ప్రతి సారి కొత్త వారితో గొప్ప వారితో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటానంటూ చెప్పుకొచ్చింది.