సిద్ధు, భాస్కర్ మధ్య ఏమైనా జరిగిందా? క్లారిటీ ఇదిగో..

ఏ మూవీ అయినా ఒక టీమ్ వర్క్ లాంటిదని తెలిపారు భాస్కర్. ఎవరైనా కూడా సినిమా అవుట్ పుట్ కోసం హార్డ్ వర్క్ చేస్తారని చెప్పారు.;

Update: 2025-04-03 13:03 GMT
సిద్ధు, భాస్కర్ మధ్య ఏమైనా జరిగిందా? క్లారిటీ ఇదిగో..

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో జాక్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపొందిన ఆ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు గ్రాండ్ గా నిర్మించారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న జాక్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ రాగా.. ఏప్రిల్ 10వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. అయితే షూటింగ్ సమయంలో హీరో, డైరెక్టర్ మధ్య గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని కూడా టాక్ వినిపించింది.

సినిమా క్రియేటివ్ వర్క్స్ లో సిద్ధు చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడని, అది డైరెక్టర్ కు నచ్చలేదని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఓ సాంగ్.. భాస్కర్ లేకుండానే షూట్ కూడా చేశారని వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ విషయంపై సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ స్పందించారు.

ఏ మూవీ అయినా ఒక టీమ్ వర్క్ లాంటిదని తెలిపారు భాస్కర్. ఎవరైనా కూడా సినిమా అవుట్ పుట్ కోసం హార్డ్ వర్క్ చేస్తారని చెప్పారు. డిస్కషన్ రూమ్ లోకి వెళ్లినప్పుడు వార్ జోన్ లా ఫీలవుతామని పేర్కొన్నారు. రూమ్ కు వెళ్లాక సినిమా కోసం తిట్టుకుంటామని, కొట్టుకొంటామని వెల్లడించారు. కానీ ఆ రూమ్ నుంచి బయటకొచ్చాక అన్నీ మర్చిపోతామని అన్నారు.

అదే సమయంలో సిద్ధు మంచి టాలెంటెడ్ హీరో అని చెప్పుకొచ్చారు భాస్కర్. అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉందని తెలిపారు. అది ఎప్పుడైనా ఏ సినిమాకు అయినా ప్లస్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా సీన్స్ విషయంలో సిద్ధును నమ్మవచ్చని అన్నారు. జస్ట్ యాక్షన్ కట్ అనేస్తే చాలని తెలిపారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టతనిచ్చారు.

ఆ తర్వాత డైరెక్టర్ లేకుండా సాంగ్ షూటింగ్ జరిగిందంటూ వచ్చిన వార్తలపై సిద్ధు మాట్లాడారు. భాస్కర్ కు తెలియకుండా ఎలా పాట షూట్ చేస్తామని క్వశ్చన్ చేశారు. ఏసీలో మీరు పని చేసుకోండి.. మేము మండుటెండలో కష్టపడతామని జస్ట్ తాను జోక్ చేశానని చెప్పారు. కానీ అది నిజమనుకున్నారని, అలా ఏం జరగలేదని తెలిపారు. మొత్తానికి సిద్ధు, భాస్కర్ తమ మధ్య రిలేషన్ బాగానే ఉందని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News