స్టార్ హీరో 'డ్రాగ‌న్‌'తో కంబ్యాక్ అవుతాడా?

అత‌డికి స‌మ‌య‌పాల‌న స‌రిగా లేదని, క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆరోపించ‌డంతో కెరీర్ ప‌రంగా చాలా న‌ష్ట‌పోయాడు.

Update: 2025-02-16 05:38 GMT

మ‌న్మ‌ధ‌, వ‌ల్ల‌భ లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు శింబు సుప‌రిచితుడు. మంచు మ‌నోజ్ సినిమాకు పాట కూడా పాడాడు. కొల‌వెరి డి లాంటి సంచ‌ల‌నంతో హాట్ టాపిక్ అయ్యాడు. అంత‌కుముందు న‌య‌న‌తార‌, త్రిష, హ‌న్సిక‌ లాంటి అగ్ర క‌థానాయిక‌ల‌తో శింబు డేటింగ్ చేసాడు. అదంతా అటుంచితే శింబు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో నిరంత‌రం వార్త‌ల్లో నిలిచాడు. అత‌డికి స‌మ‌య‌పాల‌న స‌రిగా లేదని, క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆరోపించ‌డంతో కెరీర్ ప‌రంగా చాలా న‌ష్ట‌పోయాడు.

అయితే శింబు ఇటీవ‌ల వివాదాల జోలికి వెళ్ల‌కుండా, కేవ‌లం న‌టుడిగా నిరూపించుకునేందుకు కంబ్యాక్ అయ్యేంద‌కు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అత‌డు `పార్కింగ్` ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన STR 49 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అతడు వ‌రుస‌ ప్రాజెక్టులకు పని చేస్తాడు.

దేశింగ్ పెరియసామి దర్శకత్వంలో శింబు త‌న కెరీర్ 50వ చిత్రంలో న‌టించాల్సి ఉంది. అంత‌కుముందే అశ్వత్ మారిముత్తుతో సినిమాని పూర్తి చేసాడు. ఈ నెల 21న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు శింబు స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. 2020లో ఫాంటసీ ఎంటర్‌టైనర్ `ఓ మై కడవులే`తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అశ్వ‌త్ మొద‌టి ప్ర‌య‌త్న‌మే నిరూపించుకుని ఇప్పుడు శింబుతో `డ్రాగన్` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌చారంలో టీమ్ బిజీ బిజీగా ఉంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన మూవీ. శింబు అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు.

Tags:    

Similar News