పిక్‌టాక్‌ : కిస్సిక్‌ బ్యూటీ అందాల రైడ్‌

ఒక వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీలీల అందాల ఆరబోత చేయడంతో పాటు క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్‌తో అందరిని ఆకట్టుకుంటూ ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసింది.

Update: 2024-12-29 12:00 GMT

రాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా ధమాకా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. రవితేజతో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో మహేష్ బాబుతో కలిసి త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా శ్రీలీల జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ చేసి దేశం మొత్తం కిస్సిక్‌ బ్యూటీ అనిపించుకుంది.

 

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. శ్రీలీల నటిగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్న కారణంగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీలీల అందాల ఆరబోత చేయడంతో పాటు క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్‌తో అందరిని ఆకట్టుకుంటూ ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసింది. తన అందంతో గతంలోనే ఆకట్టుకున్న శ్రీలీల మరోసారి తన క్యూట్‌ ఫోటోలతో కన్నుల విందు చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్‌ దేవరకొండతో కలిసి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఆ సినిమా విడుదల కాబోతుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో వరుసగా మూడు నాలుగు సినిమాలను ఈ అమ్మడు కమిట్‌ అయ్యింది. త్వరలోనే నవీన్‌ పొలిశెట్టి హీరోగా రూపొందబోతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతుంది. అంతే కాకుండా నితిన్‌ తో కలిసి ఒక సినిమాను చేసింది. రాబిన్‌హుడ్‌ అనే టైటిల్‌తో వచ్చిన ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా శ్రీలీల జోరుగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

 

మొదటి సినిమా ఫ్లాప్‌ అయినా వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకోవడం ఈ అమ్మడికే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఎప్పుడూ ఈ అమ్మడి పోటోలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలు వీడియోలతో రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. శ్రీలీల వచ్చే ఏడాదిలో మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో రెండు మూడు సినిమాలు హిట్ అయినా మరిన్ని సినిమాల్లో ఈ అమ్మడు నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News