టాలీవుడ్ సొంత ఇల్లు లాంటిది
దాని వల్లే రెండో సినిమాకు ఏకంగా రవితేజతో ఛాన్స్ కొట్టేసి ధమాకా సినిమా చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి;

కన్నడ సినిమాలో నటించడం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీలీల తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి2తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ శ్రీలీల నటనకు, ఆమె డ్యాన్సులకు మంచి క్రేజ్ వచ్చింది. దాని వల్లే రెండో సినిమాకు ఏకంగా రవితేజతో ఛాన్స్ కొట్టేసి ధమాకా సినిమా చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
టాలీవుడ్ లో ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఆ టైమ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ లో లీల స్టెప్పులకు అందరూ అవాక్కయ్యారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు అదే టైమ్ లో పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది.
స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఐటెం సాంగ్ ఏం చేద్దాంలే అనుకోకుండా శ్రీలీల ఆ స్పెషల్ సాంగ్ చేసి నేషనల్ వైడ్ లో ఒక్కసారిగా వైరల్ అయింది. ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆల్రెడీ హిందీలో డెబ్యూ సినిమాను మొదలుపెట్టిన శ్రీలీలకు రీసెంట్ గా ఓ ప్రశ్న ఎదురైంది.
బాలీవుడ్ లో సెటిల్ అయిపోతారా అనే ప్రశ్న శ్రీలీలకు ఎదురవగా, తాను బాలీవుడ్ లో సెటిలైపోతానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని శ్రీలీల తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు సొంత ఇల్లు లాంటిదని, అలాంటి ఇంటిని ఎవరైనా ఎందుకు వదిలిపెడతారని శ్రీలీల పేర్కొంది. అయితే శ్రీలీల ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన చదువుని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
తన తల్లిలానే తాను కూడా డాక్టర్ అవాలనే కోరికతో శ్రీలీల మెడిసిన్ చదువుతోంది. మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదవడం కోసం తాను కొన్ని సినీ అవకాశాలను వదులుకున్నట్టు చెప్తోన్న శ్రీలీల, నితిన్ తో కలిసి చేసిన రాబిన్‌హుడ్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలీల బాలీవుడ్ లో సెటిలవుతుందని అనుకోవడానికి రావడానికి కారణం ఆమె తన బాలీవుడ్ కో యాక్టర్ కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు రావడమే.