పిక్ టాక్: సింగిల్ ఫ్రేమ్‌లో మూకుతీ అమ్మన్ లేడీ గ్యాంగ్
2020లో నయనతార మెయిన్ లీడ్ లో వచ్చిన ఫాంటసీ కామెడీ మూకుతీ అమ్మన్ సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.;
2020లో నయనతార మెయిన్ లీడ్ లో వచ్చిన ఫాంటసీ కామెడీ మూకుతీ అమ్మన్ సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో అధికారికంగా మొదలైంది. నయనతార కూడా ఈ సినిమా ఓపెనింగ్ లో పాల్గొని అందరినీ షాకయ్యేలా చేసింది. మూకుతీ అమ్మన్2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో రెజీనా కెసాండ్రా, అభినయ, మీనా, దునియా విజయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మూకుతీ అమ్మన్2 పూజా కార్యక్రమంలో భాగంగా చిత్రంలోని లేడీ గ్యాంగ్ అంతా కలిసి దిగిన కలర్‌ఫుల్ సెల్ఫీ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఈ సెల్ఫీలో నయనతార, ఖుష్బూ, మీనా, రెజనాతో పాటూ యాంకర్ దివ్య దర్శిని కూడా ఉంది.
అసలు ఎప్పుడూ పూజా కార్యక్రమాలకు హాజరవని నయనతార తోటి నటీనటులతో కలిసి ఇలా స్పెషల్ గా ఫోటోలు కూడా దిగడంతో ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, అవ్నీ సినిమాస్, రౌడీ పిక్చర్స్, ఐవీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు హిపాప్ థమీజా సంగీతం అందించనున్నారు.
మూకుతీ అమ్మన్‌కు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, ఇప్పుడు ఈ సినిమాను మరింత గ్రాండ్ గా తెరకెక్కించాలనే ఆలోచనతో ఆ బాధ్యతల్ని సుందర్.సి కు అప్పగించారు. ఈ సినిమా కథను సుందర్ కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేశాడని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మూకుతీ అమ్మన్2 సినిమా రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందనుంది.
ఇక మొన్నటికి మొన్న తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దంటూ అభిమానులను, మీడియాను కోరుతూ లెటర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ బిరుదు తనను కంఫర్ట్ గా ఉండనీయడం లేదని, తనని నయనతార అని మాత్రమే పిలవాలని షాకిచ్చి వార్తల్లో నిలిచిన నయన్, ఎప్పుడూ లేనిది ఇప్పుడు సినిమా ఓపెనింగ్ కు హాజరై మరోసారి వార్తల్లో నిలిచింది.