తమిళనాడు.. రీసెంట్ సినిమాల గ్రాస్ ఎంతంటే?
అయిన కూడా లాంగ్ రన్ లో ఈ చిత్రం 150 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మాత్రం కేవలం 35.85 కోట్ల కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి.
కోలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సారి పెద్ద సినిమాల నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. పాన్ ఇండియా రేంజ్ లో కోలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. 'కెప్టెన్ మిల్లర్', 'ది గోట్', 'కంగువా', 'ఇండియన్ 2', 'వేట్టయాన్', 'అమరన్' చిత్రాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఒక్క అమరన్ మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో పాటు మంచి ప్రాఫిట్ ని కూడా అందుకుంది. రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ చిత్రానికి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తమిళ్ సినిమాలకి తమిళనాడులో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే అత్యధిక వసూళ్లని అందుకుంది శివ కార్తికేయన్ 'అమరన్' మాత్రమే. ఈ సినిమా ఏకంగా 156.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని తమిళనాడు రాష్ట్రంలో వసూళ్లు చేసింది.
దీని తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా అంటే ధనుష్ 'రాయన్' ఈ మూవీ తమిళనాడులో 81 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి టాప్ 2లో నిలిచింది. నెక్స్ట్ శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'అయలాన్' 57.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' నిలిచింది. ఈ చిత్రం తమిళనాట 38.90 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
దీని తర్వాత సూర్య డిజాస్టర్ మూవీ 'కంగువా' 35.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. నిజానికి ఈ సినిమా 1000 కోట్లు వసూళ్లు చేస్తుందని అంచనా వేశారు. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. అయిన కూడా లాంగ్ రన్ లో ఈ చిత్రం 150 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మాత్రం కేవలం 35.85 కోట్ల కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి.
ఇవి కాకుండా తమిళంలో కొన్ని చిన్న సినిమాలు ఈ ఏడాది ఎక్కువ సక్సెస్ లు సాధించాయి. నేటివిటీకి కట్టుబడి తెరకెక్కించిన కథలకి తమిళ ప్రేక్షకులు ఎక్కువగా పట్టం కట్టారు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' తమిళనాడులో 50 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసి ఈ టాప్ చిత్రాల సరసన నిలబడింది.
ఈ మూవీ కంటెంట్ కి అక్కడి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ తమిళనాడు నేపథ్యంలో కూడా తెరకెక్కించారు. అందుకే అక్కడి ఆడియన్స్ కి ఈ చిత్రం కనెక్ట్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. అయితే కోలీవుడ్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువగా ఉండటంతో అక్కడ ఇంకా కమర్షియల్ సక్సెస్ జాబితాలో చేరలేదు.